జన గళం విజయవాడ బ్యూరో: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ (MSME) డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తమిరెడ్డి శివ శంకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు, శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి.
ఈ సందర్భంగా విజయవాడ మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం చైర్మన్, జనసేన పార్టీ నాయకులు సోడిశెట్టి కృష్ణ ప్రసాద్ తమ గురుతుల్యులు తమిరెడ్డి శివ శంకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సంక్షేమం, జనసేన పార్టీ బలోపేతం కోసం శివ శంకర్ గారు అందిస్తున్న నిరంతర సేవలు పార్టీ కార్యకర్తలకు ఎంతో ఆదర్శప్రాయమని ఆయన కొనియాడారు. శ్రీ దాసాంజనేయ స్వామి వారి దివ్య కృపాకటాక్షాలతో ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని సోడిశెట్టి కృష్ణ ప్రసాద్ మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
