హైదరాబాద్ – ఓల్డ్ బోయిన్‌పల్లి వాస్తవ్యులు శ్రీ P. నరేశ్ కుమార్ రెడ్డి గారు (B+ve) ఈరోజు చిరంజీవి బ్లడ్ సెంటర్ లో 28వ సారి రక్తదానం.
మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, రక్తదానాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తూ నిరంతరం సేవలందిస్తున్న శ్రీ P నరేశ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటివరకు చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో 28 సార్లు,మొత్తంగా 58 సార్లు రక్తదానం చేయడం అభినందనీయం.
ఈ సందర్భంగా మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి తరఫున శ్రీ నరేశ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
వారికి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ఎల్లవేళలా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
చిరంజీవి బ్లడ్ సెంటర్
