బ్రేకింగ్ న్యూస్
బాలయ్య–గోపీచంద్ మలినేని క్రేజీ కాంబోలో ‘ఎన్‌బీకే 111’: వృద్ధి సినిమాస్ పతాకంపై కిలారు వెంకట సతీష్ భారీ నిర్మాణం.. మరోసారి అలరించనున్న బాలయ్య–కాజల్ జోడీ!​శ్రీ విజయ గణపతి నవరాత్రోత్సవాలకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడికి ఆహ్వానం: ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ కమిటీ ప్రతినిధి కొట్టె వెంకటరావుహఫీజ్‌పేటలో మహిళపై హోంగార్డు అరాచకం: జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు వైరల్.. నిందితుడు ఆనంద్ డిస్మిస్, అరెస్ట్ చేసి జైలుకు తరలింపుపిఠాపురంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనుల జాతర: సోమవారం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన.. భారీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుడీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలి: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్.. ఈ నెల 21న ‘శాప్’ కార్యాలయానికి భారీ నిరసన ర్యాలీదసరా ఉత్సవాల పేరిట నకిలీ పూజా టికెట్ల దందా: భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న దుర్గగుడి ఈవో శీనా నాయక్.. సీపీకి దేవస్థానం అధికారిక ఫిర్యాదు​మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నేతలు: 59వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రభుజి యాంపాటికి అవకాశమివ్వాలని విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన మంత్రిమంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నాయకురాలు తిరుపతి అనూష: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చదసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతలు: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు, క్యూలైన్ల పరిశీలనరాబోయే కాలం ‘బ్రహ్మచర్య యుగం’ కానుందా?: యువతలో మారుతున్న ఆలోచనా సరళిపై అంతర్జాతీయ అధ్యయనాల హెచ్చరికబాలయ్య–గోపీచంద్ మలినేని క్రేజీ కాంబోలో ‘ఎన్‌బీకే 111’: వృద్ధి సినిమాస్ పతాకంపై కిలారు వెంకట సతీష్ భారీ నిర్మాణం.. మరోసారి అలరించనున్న బాలయ్య–కాజల్ జోడీ!​శ్రీ విజయ గణపతి నవరాత్రోత్సవాలకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడికి ఆహ్వానం: ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ కమిటీ ప్రతినిధి కొట్టె వెంకటరావుహఫీజ్‌పేటలో మహిళపై హోంగార్డు అరాచకం: జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు వైరల్.. నిందితుడు ఆనంద్ డిస్మిస్, అరెస్ట్ చేసి జైలుకు తరలింపుపిఠాపురంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనుల జాతర: సోమవారం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన.. భారీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుడీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలి: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్.. ఈ నెల 21న ‘శాప్’ కార్యాలయానికి భారీ నిరసన ర్యాలీదసరా ఉత్సవాల పేరిట నకిలీ పూజా టికెట్ల దందా: భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న దుర్గగుడి ఈవో శీనా నాయక్.. సీపీకి దేవస్థానం అధికారిక ఫిర్యాదు​మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నేతలు: 59వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రభుజి యాంపాటికి అవకాశమివ్వాలని విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన మంత్రిమంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నాయకురాలు తిరుపతి అనూష: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చదసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతలు: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు, క్యూలైన్ల పరిశీలనరాబోయే కాలం ‘బ్రహ్మచర్య యుగం’ కానుందా?: యువతలో మారుతున్న ఆలోచనా సరళిపై అంతర్జాతీయ అధ్యయనాల హెచ్చరిక
ఆంద్ర ప్రదేశ్

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలి: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్.. ఈ నెల 21న ‘శాప్’ కార్యాలయానికి భారీ నిరసన ర్యాలీ

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలి: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్.. ఈ నెల 21న ‘శాప్’ కార్యాలయానికి భారీ నిరసన ర్యాలీ

​విజయవాడ, 2026 సెప్టెంబర్ 19, (జనగళం బ్యూరో):

రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ (డీఎస్సీ) స్పోర్ట్స్ కోటా విభాగంలో జరిగిన భారీ అవకతవకలు, దొడ్డిదారిన జరిగిన పోస్టుల కేటాయింపులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి కష్టపడి మెడల్స్ సాధించిన ప్రతిభావంతులైన క్రీడాకారులను పక్కనపెట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. అర్హులైన ప్రతి బాధిత అభ్యర్థికి పూర్తి న్యాయం చేకూరే వరకు వైఎస్సార్‌సీపీ అండగా నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు.

​వివరాలు ఇలా ఉన్నాయి, డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలకు నిరసనగా, నష్టపోయిన నిరుద్యోగ అభ్యర్థులకు మద్దతుగా ఈ నెల 21వ తేదీన విజయవాడ నగరంలో భారీ ఎత్తున శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ర్యాలీ కస్తూరిభాయ్‌పేటలోని రెడ్ సర్కిల్ (బిషప్ అజరయ్య ఉమెన్స్ కళాశాల సమీపం) నుంచి ఉదయం ప్రారంభమై, బందరు రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ప్రధాన కార్యాలయం వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం ‘శాప్’ ఉన్నతాధికారులను కలిసి నియామకాల్లో జరిగిన గోల్‌మాల్‌పై నిష్పక్షపాత విచారణ కోరుతూ అధికారికంగా వినతిపత్రం అందజేయనున్నట్లు వివరించారు.

Related News Desk ​శ్రీ విజయ గణపతి నవరాత్రోత్సవాలకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడికి ఆహ్వానం: ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ కమిటీ ప్రతినిధి కొట్టె వెంకటరావు

పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో సమరశంఖం – సన్నాహక భేటీ:

ఈ నిరసన కార్యక్రమ కార్యాచరణ, ఏర్పాట్లపై శనివారం నాడు విజయవాడ బ్రాహ్మణ వీధిలోని వైఎస్సార్‌సీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పశ్చిమ పరిధిలోని వివిధ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌ఛార్జులు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు హాజరయ్యారు.

​ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత, క్రీడారంగాన్ని నమ్ముకున్న విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత లేని వారికి కట్టబెట్టే కుట్రలను ప్రజల ముందు ఎండగడతామన్నారు. 21న నిర్వహించే భారీ శాంతియుత ర్యాలీకి పార్టీ శ్రేణులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, క్రీడా సంఘాల నాయకులు, బాధితులు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.