బ్రేకింగ్ న్యూస్
శ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!పవిత్రమైన శ్రీ వినాయక చవితి పండగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! 🌸🙏🌸 గుడివాడలో వాడవాడలా వైభవంగా వినాయక చవితి వేడుకలు! 🌸విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో యువత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… 🌸🙏శ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!పవిత్రమైన శ్రీ వినాయక చవితి పండగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! 🌸🙏🌸 గుడివాడలో వాడవాడలా వైభవంగా వినాయక చవితి వేడుకలు! 🌸విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో యువత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… 🌸🙏
ఆంద్ర ప్రదేశ్

తీరప్రాంత రహదారికి తప్పని శాపం: 35 వేల మంది ప్రజల నిత్య నరకయాతన

తీరప్రాంత రహదారికి తప్పని శాపం: 35 వేల మంది ప్రజల నిత్య నరకయాతన

​15 ఏళ్లుగా అందని శాశ్వత పరిష్కారం.. వర్షం వస్తే రాకపోకలు బంద్
​నిడమర్రు, పెదగొల్లపాలెం సహా పలు తీరప్రాంత గ్రామాలకు తీవ్ర ఆటంకం
​అధికారుల హామీలు నీటిమూటలే.. స్పందించాలని కోరుతున్న స్థానికులు
​కృత్తివెన్ను (జనగలం ప్రతినిధి):
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని సముద్ర తీరప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన ప్రధాన రహదారి నిర్మాణం ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. జాతీయ రహదారి 216 నుంచి లక్ష్మీపురం, పోడు మీదుగా నిడమర్రు తీరప్రాంతాన్ని కలిపే కీలకమైన లింకు రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరి, రాకపోకలు సాగించే ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. ఆర్ అండ్ బీ (R&B) పరిధిలో ఉన్న ఈ మార్గం దాదాపు 15 సంవత్సరాలుగా శాశ్వత మరమ్మతులకు నోచుకోకపోవడంతో స్థానికుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
​35 వేల మందికి ఇదొక్కటే జీవనాధార మార్గం
సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న రెండు మేజర్ పంచాయతీలతో పాటు చుట్టుపక్కల సుమారు 10 గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కొనసాగించేందుకు ఈ రహదారే ఆధారం:
​ప్రధాన గ్రామాలు: నిడమర్రు, ఒర్లగొందితిప్ప, పెదగొల్లపాలెం, పోడు, అడవిదొడ్లు, పడతడిక, చినగొల్లపాలెం దివి తదితర గ్రామాల ప్రజలు నిత్య అవసరాల కోసం లక్ష్మీపురం రావాలంటే ఈ రూట్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.
​ఆక్వా వాహనాల తాకిడి: విస్తారమైన ఆక్వా సాగు జరిగే ప్రాంతం కావడంతో నిత్యం భారీ లోడ్ వాహనాలు ఇక్కడే రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో రోడ్డు మరింత కుంగిపోయి భారీ గోతులు ఏర్పడుతున్నాయి.
​పర్యాటకుల తిప్పలు: పెదగొల్లపాలెం బీచ్‌కు వెళ్లే పర్యాటకులు కూడా ప్రమాదకరమైన ఈ మార్గంలోనే ప్రయాణించాల్సి వస్తోంది.
​పరిశీలనలు ఎన్నో.. చర్యలు శూన్యం
కూటమి ప్రభుత్వం రాగానే స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ చొరవతో చేపట్టిన తాత్కాలిక ప్యాచ్ వర్కులు స్వల్ప వర్షాలకే కొట్టుకుపోయాయి. గత ఏడాది వర్షాలకు రహదారి పూర్తిగా జలమయమైన సమయంలో జిల్లా కలెక్టర్ బాలాజీ స్వయంగా వచ్చి పరిశీలించి, తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే శాశ్వత పరిష్కారం చూపాల్సిన యంత్రాంగం, అప్పట్లో తాత్కాలికంగా రాకపోకలను నిలిపివేసి చేతులు దులుపుకుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
​ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్లే తాము ఈ గుంతల రోడ్డుపై ఎలాగోలా ప్రయాణించగలుగుతున్నామని, అదే సాధారణ వర్షాలు పడి ఉంటే మార్గమంతా జలదిగ్బంధంలో చిక్కుకుపోయేదని స్థానికులు వాపోతున్నారు. స్థానిక సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వెంటనే ప్రత్యేక చొరవ చూపి, ఈ ప్రధాన లింకు రహదారికి శాశ్వత బీటీ లేదా సీసీ రోడ్డు మంజూరు చేయించి తమ కష్టాలను తీర్చాలని తీరప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.