బ్రేకింగ్ న్యూస్
తిరువూరు మండలం ముష్టికుంట్ల ఎంపీటీసీ స్థానంలో రాష్ట్రంలోనే మొదటి ఫ్రెండ్లీ కాంటెస్ట్: బరిలో జనసేన, టీడీపీ అభ్యర్థులు!తుపాను ‘తీరం దాటడం’ అంటే ఏమిటి? సైక్లోన్ కన్ను చేసే మాయ, ల్యాండ్‌ఫాల్ వెనుక దాగిన శాస్త్రీయ రహస్యాలు (ప్రత్యేక సైన్స్ విశ్లేషణ)జీవితం అంటే కేవలం లెక్కలు కాదు… తర్కానికి అందని అనుభవాల ప్రయాణం: సింధుర తాడి స్ఫూర్తిదాయక ఆలోచనలు (సోషల్ మీడియా డెస్క్)గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.కలిదిండి లంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల చలపతి విస్తృత పర్యటన: అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, కూటమి శ్రేణులు (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుగ్రేటర్ విజయవాడ పరిధిలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా వసుధ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్: వెస్ట్ బైపాస్ సమీపంలో ప్రత్యేక లాంచింగ్ ఆఫర్‌తో ఓపెన్ ప్లాట్లు (రియల్ ఎస్టేట్ డెస్క్)గుండుపాలెం పరిధిలోని పల్లెల్లో మొబైల్ సిగ్నల్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి కోన నాగార్జున చొరవ: సర్వే నిర్వహించి టెలికాం శాఖకు నివేదిక (సోషల్ మీడియా సోర్స్)జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సుగుణ బాబు ఇల్లూరి!తిరువూరు మండలం ముష్టికుంట్ల ఎంపీటీసీ స్థానంలో రాష్ట్రంలోనే మొదటి ఫ్రెండ్లీ కాంటెస్ట్: బరిలో జనసేన, టీడీపీ అభ్యర్థులు!తుపాను ‘తీరం దాటడం’ అంటే ఏమిటి? సైక్లోన్ కన్ను చేసే మాయ, ల్యాండ్‌ఫాల్ వెనుక దాగిన శాస్త్రీయ రహస్యాలు (ప్రత్యేక సైన్స్ విశ్లేషణ)జీవితం అంటే కేవలం లెక్కలు కాదు… తర్కానికి అందని అనుభవాల ప్రయాణం: సింధుర తాడి స్ఫూర్తిదాయక ఆలోచనలు (సోషల్ మీడియా డెస్క్)గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.కలిదిండి లంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల చలపతి విస్తృత పర్యటన: అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, కూటమి శ్రేణులు (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుగ్రేటర్ విజయవాడ పరిధిలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా వసుధ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్: వెస్ట్ బైపాస్ సమీపంలో ప్రత్యేక లాంచింగ్ ఆఫర్‌తో ఓపెన్ ప్లాట్లు (రియల్ ఎస్టేట్ డెస్క్)గుండుపాలెం పరిధిలోని పల్లెల్లో మొబైల్ సిగ్నల్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి కోన నాగార్జున చొరవ: సర్వే నిర్వహించి టెలికాం శాఖకు నివేదిక (సోషల్ మీడియా సోర్స్)జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సుగుణ బాబు ఇల్లూరి!
రాజకీయం

పెడన రైల్వే స్టేషన్‌లో మరుగుదొడ్ల అసంపూర్తి పనులు: అధికారుల నిర్లక్ష్యంపై జేఏసీ ఆగ్రహం

పెడన రైల్వే స్టేషన్‌లో మరుగుదొడ్ల అసంపూర్తి పనులు: అధికారుల నిర్లక్ష్యంపై జేఏసీ ఆగ్రహం
WhatsApp Image 2026-09-13 at 11.21.57 AM

 

కృష్ణా జిల్లాలోని ప్రముఖ చేనేత, కలంకారీ హబ్‌గా గుర్తింపు పొందిన పెడన పట్టణ రైల్వే స్టేషన్‌లో కనీస మౌలిక వసతులు కరవయ్యాయి. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ స్టేషన్‌లో అత్యంత ఆవశ్యకమైన మరుగుదొడ్ల నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోవడం పట్ల స్థానికులు, ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం కారణంగా ప్రయాణికులకు అవమానకర పరిస్థితులు ఎదురవుతున్నాయని పెడన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) మండిపడింది.

రైల్వే స్టేషన్‌లోని శౌచాలయాల నిర్మాణం, నిర్వహణ విషయాల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పురుషుల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాకపోవడంతో వాటికి చెక్క బోర్డులు అడ్డం పెట్టి చేతులు దులుపుకున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో పురుషులు, వృద్ధులు వేరే మార్గం లేక మహిళల టాయిలెట్లను ఆశ్రయించాల్సి వస్తోంది.

మహిళా విభాగంలోకి పురుషులు రావడంతో అక్కడ తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఈ విషయంలో ప్రయాణికుల మధ్య నిత్యం వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. వాడకంలో లేని మరుగుదొడ్లకు కేవలం ‘జెంట్స్’, ‘లేడీస్’ అని బోర్డులు తగిలించి వదిలేస్తే ప్రయోజనం ఏమిటని ప్రయాణికులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.

Related News Desk మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

కలంకారీ కళతో దేశవిదేశాల్లో ఖ్యాతిగాంచిన పెడనకు వ్యాపార, పర్యాటక రీత్యా నిత్యం వందలాది మంది ప్రయాణికులు రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. అంతటి కీలకమైన కేంద్రంలో శౌచాలయాలు, విశ్రాంతి గదులు వంటి కనీస సదుపాయాలు అందుబాటులో లేకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ తీవ్ర సమస్యపై విజయవాడ, భీమవరం రైల్వే అధికారులకు ఫోన్ ద్వారా ఇప్పటికే సమాచారం అందించినట్లు జేఏసీ నేత శ్రీనివాస్ వీణం తెలిపారు. కాంట్రాక్టర్ల అలసత్వంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయని పక్షంలో సంబంధిత కాంట్రాక్టును రద్దు చేసి, వేరొకరితో తక్షణమే పనులు పూర్తి చేయించాలని కోరారు.

రైల్వే శాఖ వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న పనులను పునరుద్ధరించాలని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఒకవేళ సమస్యను పరిష్కరించకపోతే ప్రయాణికులను కలుపుకుని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని శ్రీనివాస్ వీణం మిత్రబృందం, ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరించాయి.