*ఆంధ్రా సైబర్ ఆణిముత్యం* *గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ దేశదిగ్గజాల రేసులో భారత్ కీర్తిని చాటిన తెలుగోడు సత్తా* *ప్రపంచ దేశాలలో “16”వ ర్యాంక్ సాధించిన* *యువ సైబర్ సాంకేతిక నిపుణుడు షణ్ముఖ శ్రీ సాయి కొమ్మూరి**భారతీయ సైబర్ సెక్యూరిటీ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది*. *ప్రముఖ ప్రపంచ స్థాయి సంస్థ థింకర్స్ 360 ప్రకటించిన భద్రత విభాగంలో 2026 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా 196 అగ్రస్థానంలో నుండి 50 మంది మేధావులు* మరియు ప్రతిభావంతుల జాబితాలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎ. న్టీ .ఆర్ జిల్లా, విజయవాడ పార్లమెంట్,తిరువూరు నియోజకవర్గం,విస్సన్నపేట మండలం, విస్సన్నపేటకు చెందిన యువ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు షణ్ముఖ శ్రీ సాయి కొమ్మూరి (రాజమండ్రి వారి బట్టల షాపు) ప్రపంచంలోనే 16వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు*.24 ఏళ్లకే అరుదైన గుర్తింపు:కేవలం 24 ఏళ్ల చిన్న వయసులోనే షణ్ముఖ శ్రీ సాయి ప్రాక్టికల్ సైబర్ సెక్యూరిటీ, వల్నరబిలిటీ రీసెర్చ్, పెనిట్రేషన్ టెస్టింగ్, సెక్యూరిటీ ఇంజినీరింగ్ మరియు నాలెడ్జ్ షేరింగ్ వంటి సంక్లిష్టమైన రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి ప్రత్యేక గుర్తింపు పొందారు. చిన్ననాటి నుంచే టెక్నాలజీపై ఉన్న ఆసక్తితో సైబర్ సెక్యూరిటీపై ప్రాక్టికల్ రీసెర్చ్ చేస్తూ, వివిధ సంస్థలలోని భద్రతా లోపాలను ముందే గుర్తించి హెచ్చరించడం, ఈ రంగంపై నిరంతరం అవగాహన కల్పించడం ఆయనను ఈ స్థాయికి చేర్చాయి…….ఈ ర్యాంకింగ్ ప్రత్యేకం ఎందుకంటే?థింకర్స్360 అందించే ఈ ర్యాంకింగ్ కేవలం సాధారణ కోర్సులు, టెక్నికల్ సర్టిఫికేషన్‌లు లేదా పరీక్షల ఆధారంగా ఇచ్చేది కాదు. ఒక ప్రొఫెషనల్ సాధించిన అనుభవం, వారు రాసిన రీసెర్చ్ ఆర్టికల్స్, ప్రసంగాలు, మీడియా తోడ్పాటు మరియు వారు ప్రపంచానికి అందించిన నాలెడ్జ్ షేరింగ్ వంటి వాస్తవిక అంశాలను కూలంకషంగా పరిశీలించి ఈ ర్యాంకింగ్‌ను కేటాయిస్తారు. ….షణ్ముఖ శ్రీ సాయి కొమ్మూరి మాట్లాడుతూ ప్రతిష్టాత్మక 2026 గ్లోబల్ సెక్యూరిటీ జాబితాలో నిలవడం , సైబర్ సెక్యూరిటీ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచింది.ఈ గుర్తింపును నేను ఒక మైలురాయిగా మాత్రమే చూస్తున్నాను, గమ్యంగా కాదు. మరింతగా నేర్చుకోవడం, నిరంతరం రీసెర్చ్ చేయడం, ప్రాక్టికల్ సెక్యూరిటీ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం మరియు సమాజానికి ఉపయోగపడే నాలెడ్జ్‌ను పంచుకోవడమే నా ప్రధాన లక్ష్యంమనిఅన్నారు.ప్రపంచ సైబర్ వేదికపై భారత్ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన ఈ యువ సైబర్ నిపుణుడికి పలువురు డిజిటల్ దిగ్గజాలు మరియు నిపుణులు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఆంధ్రా సైబర్ ఆణిముత్యం
