బ్రేకింగ్ న్యూస్
తిరువూరు మండలం ముష్టికుంట్ల ఎంపీటీసీ స్థానంలో రాష్ట్రంలోనే మొదటి ఫ్రెండ్లీ కాంటెస్ట్: బరిలో జనసేన, టీడీపీ అభ్యర్థులు!తుపాను ‘తీరం దాటడం’ అంటే ఏమిటి? సైక్లోన్ కన్ను చేసే మాయ, ల్యాండ్‌ఫాల్ వెనుక దాగిన శాస్త్రీయ రహస్యాలు (ప్రత్యేక సైన్స్ విశ్లేషణ)జీవితం అంటే కేవలం లెక్కలు కాదు… తర్కానికి అందని అనుభవాల ప్రయాణం: సింధుర తాడి స్ఫూర్తిదాయక ఆలోచనలు (సోషల్ మీడియా డెస్క్)గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.కలిదిండి లంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల చలపతి విస్తృత పర్యటన: అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, కూటమి శ్రేణులు (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుగ్రేటర్ విజయవాడ పరిధిలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా వసుధ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్: వెస్ట్ బైపాస్ సమీపంలో ప్రత్యేక లాంచింగ్ ఆఫర్‌తో ఓపెన్ ప్లాట్లు (రియల్ ఎస్టేట్ డెస్క్)గుండుపాలెం పరిధిలోని పల్లెల్లో మొబైల్ సిగ్నల్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి కోన నాగార్జున చొరవ: సర్వే నిర్వహించి టెలికాం శాఖకు నివేదిక (సోషల్ మీడియా సోర్స్)జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సుగుణ బాబు ఇల్లూరి!తిరువూరు మండలం ముష్టికుంట్ల ఎంపీటీసీ స్థానంలో రాష్ట్రంలోనే మొదటి ఫ్రెండ్లీ కాంటెస్ట్: బరిలో జనసేన, టీడీపీ అభ్యర్థులు!తుపాను ‘తీరం దాటడం’ అంటే ఏమిటి? సైక్లోన్ కన్ను చేసే మాయ, ల్యాండ్‌ఫాల్ వెనుక దాగిన శాస్త్రీయ రహస్యాలు (ప్రత్యేక సైన్స్ విశ్లేషణ)జీవితం అంటే కేవలం లెక్కలు కాదు… తర్కానికి అందని అనుభవాల ప్రయాణం: సింధుర తాడి స్ఫూర్తిదాయక ఆలోచనలు (సోషల్ మీడియా డెస్క్)గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.కలిదిండి లంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల చలపతి విస్తృత పర్యటన: అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, కూటమి శ్రేణులు (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుగ్రేటర్ విజయవాడ పరిధిలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా వసుధ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్: వెస్ట్ బైపాస్ సమీపంలో ప్రత్యేక లాంచింగ్ ఆఫర్‌తో ఓపెన్ ప్లాట్లు (రియల్ ఎస్టేట్ డెస్క్)గుండుపాలెం పరిధిలోని పల్లెల్లో మొబైల్ సిగ్నల్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి కోన నాగార్జున చొరవ: సర్వే నిర్వహించి టెలికాం శాఖకు నివేదిక (సోషల్ మీడియా సోర్స్)జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సుగుణ బాబు ఇల్లూరి!
బిజినెస్

టాటా సన్స్‌కు ఆర్బీఐ షాక్.. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్ రద్దు దరఖాస్తు తిరస్కరణ

టాటా సన్స్‌కు ఆర్బీఐ షాక్.. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్ రద్దు దరఖాస్తు తిరస్కరణ

బిజినెస్ డెస్క్: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ అయిన ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ను వదులుకోవాలని భావించిన ప్రముఖ సంస్థ టాటా సన్స్‌కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ సమర్పించిన లైసెన్స్ రద్దు దరఖాస్తును ఆర్‌బీఐ తోసిపుచ్చింది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ కంపెనీ కార్యదర్శి అలాగే చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌కు ప్రత్యేకంగా ఓ లేఖను పంపింది. ఈ పరిణామంతో నిబంధనల ప్రకారం రాబోయే కాలంలో తప్పనిసరిగా దేశీయ స్టాక్‌ మార్కెట్లలో టాటా సన్స్‌ లిస్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

గతంలో 2022 సెప్టెంబర్ కాలంలో టాటా సన్స్‌ను ఉన్నత శ్రేణి ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్‌బీఐ వర్గీకరించింది. దీని ప్రకారం మూడేండ్ల గడువులోగా అంటే 2025 సెప్టెంబర్‌కల్లా స్టాక్‌ మార్కెట్లలో నమోదు కావాల్సి ఉండగా దీనిపై టాటా సన్స్‌ ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలోనే 2024 సంవత్సరంలో భారీ ఎత్తున రుణాలు చెల్లించి మార్చి నెలలో తమ కోర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ను వెనక్కి ఇస్తామని ఆర్‌బీఐకి విజ్ఞప్తి చేసింది. అయితే ఈ అభ్యర్థనను పెండింగ్‌లో పెట్టిన కేంద్ర బ్యాంక్ తాజాగా ఆ విజ్ఞప్తిని పూర్తిగా తిరస్కరించింది. కాగా రెండు లక్షల కోట్లకు పైగా ఆస్తులున్న టాటా సన్స్‌ను ప్రధాన ఎన్‌బీఎఫ్‌సీల జాబితాలోనే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Related News Desk జనసేన స్థానిక ఎన్నికల దరఖాస్తు పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు.. నేడు దరఖాస్తులు చేయవద్దని విజ్ఞప్తి

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 17 ప్రథమ శ్రేణి ఎన్‌బీఎఫ్‌సీలలో స్టాక్‌ మార్కెట్లలో నమోదు కాని ఏకైక సంస్థగా టాటా సన్స్‌ నిలిచింది. పబ్లిక్ లిస్టింగ్‌లోకి వస్తే కంపెనీకి సంబంధించిన ఆర్థిక స్థితిగతులు, పెట్టుబడులు, వాటాల విలువ తదితర వివరాలన్నీ బహిర్గతం చేయాల్సి ఉంటుందని, అంతేకాకుండా ప్రతి కీలక నిర్ణయానికి షేర్ హోల్డర్ల అనుమతి తప్పనిసరి అవుతుందనే కారణాలతోనే ఈ లైసెన్స్ రద్దుకు ఆ సంస్థ ప్రయత్నించినట్లు సమాచారం. టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ నోయల్‌ టాటా కూడా పబ్లిక్ లిస్టింగ్ వల్ల సంస్థ దీర్ఘకాలిక నిర్మాణంపై ప్రభావం పడుతుందని ఆర్‌బీఐకి తెలిపారు. అయినప్పటికీ ఆర్‌బీఐ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో త్వరలోనే టాటా సన్స్‌ మార్కెట్ ఎంట్రీ ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.