నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
- విజయవాడ సర్వతోముఖాభివృద్ధికి విఘ్నేశ్వరుని ఆశీస్సులు మెండుగా ఉండాలి
- పర్యావరణ హితంగా మట్టి వినాయకులనే పూజిద్దాం: ఎంపీ చిన్ని పిలుపు
విజయవాడ:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు, కూటమి శ్రేణులకు పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆటంకాలను తొలగించి విజయాలను చేకూర్చే విఘ్నాధిపతి ఆశీస్సులతో విజయవాడ నగరం నిరంతరం ప్రగతి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వ పాలనలో బెజవాడను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. నగర ప్రజలందరి ఇళ్లలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలని గణనాథుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు.
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తుచేస్తూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలకు బదులు పర్యావరణ హితమైన మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని కోరారు.
