- ప్రతి ఇంటా విఘ్నాలు తొలగి సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్ష
పెడన:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పెడన నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు మరియు కార్యకర్తలకు ఎస్.వి. బాబు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
“వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ…
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా”
అంటూ ఆ విఘ్నేశ్వరుని స్మరించుకున్నారు.
గణనాథుని దివ్య కృపాకటాక్షాలతో ప్రజల జీవితాల్లో ఎదురయ్యే సమస్త ఆటంకాలు, విఘ్నాలు తొలగిపోయి, అందరికీ ఆయురారోగ్యాలు, సర్వ శుభాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరూ వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఇట్లు,
ఎస్.వి. బాబు
పెడన నియోజకవర్గం
