ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ
- విఘ్నాలు తొలగి ప్రతి ఇంటా సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్ష
- తలపెట్టే ప్రతి పనిలో విజయం సిద్ధించాలి: బండి రామకృష్ణ
మచిలీపట్నం:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా డీసీఎంఎస్ చైర్మన్, మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ శ్రీ బండి రామకృష్ణ నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు మరియు కూటమి శ్రేణులకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకల విఘ్నాలను హరించే ఆ విఘ్నాధిపతి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా తలపెట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గణనాథుని కృపతో ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శ్రేయస్సు వెల్లివిరియాలని కోరుకున్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని, నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
