వర్ల రామయ్య, వర్ల కుమార్ రాజా కు ఘన సత్కారం.. ముఖ్య అతిథిగా హాజరైన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి సభ్యులు వర్ల రామయ్య కి, పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా కి శుభాకాంక్షలు తెలుపుతూ గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన అభినందన సన్మాన సభకు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. వర్ల రామయ్య తన కెరీర్లో 10 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండగానే పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, అప్పటి ముఖ్యమంత్రి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారని గుర్తుచేశారు. నిరంతరం ప్రజలతో మమేకమై ఉంటూ, పార్టీ కోసం శ్రమించే నాయకులను తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని, ముందుకు తీసుకెళ్తుంద అనడానికి రామయ్య నిదర్శనమని అన్నారు.
రాజకీయాల్లో ప్రజాసేవ, నిబద్ధతతో పాటు ఓర్పు చాలా అవసరం
రాజకీయాల్లో ఆశించే యువతకు, నాయకులకు “ఓర్పు, క్రమశిక్షణ” చాలా అవసరమని ఎంపీ పిలుపునిచ్చారు. 1999లో ఉద్యోగానికి రాజీనామా చేసిన రామయ్య ఎమ్మెల్సీ అయ్యేందుకు 2026 వరకు ఓర్పుతో పార్టీకి సేవ చేశారని, వారి కుమారుడు కుమార్ రాజా క్రమశిక్షణతో పనిచేసి ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. తొందరపాటు లేకుండా నిలకడగా ఉండేవారికే రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు.
అభినందన సభను అత్యంత ఘనంగా ఏర్పాటు చేసిన గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావుకి.. హాజరైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు మరియు రామయ్య కుటుంబ సభ్యులకు ఎంపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
