జనసేనాని ఆత్మీయ ఆలింగనం: ఏలూరు మేయర్ పీఠం కైవసంలో కీలక పాత్ర పోషించిన నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నారా శేషును మనస్ఫూర్తిగా అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్! (జన గళం పొలిటికల్ డెస్క్)
అమరావతి/ఏలూరు: ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ పదవిని జనసేన పార్టీ కైవసం చేసుకోవడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నారా వెంకట శేషగిరిరావు (నారా శేషు) గారు నేడు జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల వ్యూహరచన, పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ మేయర్ పీఠాన్ని సాధించడంలో నారా శేషు గారు చూపిన చొరవ, కృషిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రశంసించారు. పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన నారా శేషు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అధినేత నుంచి లభించిన ఈ ఆప్యాయత, ప్రశంస ఏలూరు జనసేన శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. రాబోయే రోజుల్లో ఏలూరు నగర సమగ్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మరింత అంకితభావంతో పనిచేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు.
