బ్రేకింగ్ న్యూస్
రాష్ట్రంలో మహిళల రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: హోం మంత్రి వంగలపూడి అనితముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లు పరిశీలన: అక్టోబర్ 2న అన్నమయ్య జిల్లాకు సీఎం రాకకృత్తివెన్ను మెగా తాగునీటి చెరువుకు శరవేగంగా నీటి తరలింపు: ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాలతో రంగంలోకి ఆయిల్ ఇంజన్లు.. కూటమి నేతల క్షేత్రస్థాయి పరిశీలన!పీలేరులో పరిశ్రమల ఏర్పాటుకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డే కారణం: ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిజనసేనలోకి భారీగా వైయస్సార్‌సీపీ నేతల వలసలు: పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ప్రముఖులువిజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) రేపటి పర్యటన షెడ్యూల్: పలు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్న నేతకడప జిల్లా అట్లూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మోహన్ కుమార్ గౌడ్అన్నమయ్య జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ నిశాంత్ కుమార్వినగడప కట్టలేరు వంతెన నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు: క్షేత్రస్థాయిలో పరిశీలించిన జనసేన నాయకులుకైకలూరు రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత: సోషల్ మీడియా వేదికగా చెలరేగిన పొలిటికల్ వార్ మరియు సంచలన ఆరోపణలురాష్ట్రంలో మహిళల రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: హోం మంత్రి వంగలపూడి అనితముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లు పరిశీలన: అక్టోబర్ 2న అన్నమయ్య జిల్లాకు సీఎం రాకకృత్తివెన్ను మెగా తాగునీటి చెరువుకు శరవేగంగా నీటి తరలింపు: ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాలతో రంగంలోకి ఆయిల్ ఇంజన్లు.. కూటమి నేతల క్షేత్రస్థాయి పరిశీలన!పీలేరులో పరిశ్రమల ఏర్పాటుకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డే కారణం: ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిజనసేనలోకి భారీగా వైయస్సార్‌సీపీ నేతల వలసలు: పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ప్రముఖులువిజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) రేపటి పర్యటన షెడ్యూల్: పలు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్న నేతకడప జిల్లా అట్లూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మోహన్ కుమార్ గౌడ్అన్నమయ్య జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ నిశాంత్ కుమార్వినగడప కట్టలేరు వంతెన నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు: క్షేత్రస్థాయిలో పరిశీలించిన జనసేన నాయకులుకైకలూరు రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత: సోషల్ మీడియా వేదికగా చెలరేగిన పొలిటికల్ వార్ మరియు సంచలన ఆరోపణలు
ఆంధ్ర

వినగడప కట్టలేరు వంతెన నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు: క్షేత్రస్థాయిలో పరిశీలించిన జనసేన నాయకులు

gampalagudem-vinagadapa-kattaleru-bridge-funds-janasena
వినగడప కట్టలేరు వంతెన నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు: క్షేత్రస్థాయిలో పరిశీలించిన జనసేన నాయకులు

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: గంపలగూడెం మండలం వినగడప ప్రాంతంలో కట్టలేరు వంతెనపై వరద ఉధృతిని తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు మరియు మండల జనసేన పార్టీ అధ్యక్షులు చింతలపాటి వెంకటకృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా వంతెనపైకి చేరిన వరద నీటి పరిస్థితులను, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు ప్రత్యక్షంగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వినగడపలో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపడతామని గతంలో ఇచ్చిన మాట ప్రకారం, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం యాభై కోట్ల రూపాయల పరిపాలనా నిధులు మంజూరయ్యాయని అధికారులు తెలిపినట్లు వారు వెల్లడించారు.

ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ గతంలో తాము ఇచ్చిన హామీ మేరకు ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా పార్టీ అధినాయకత్వం ద్వారా కృషి చేశామని, కూటమి ప్రభుత్వంలో ప్రజల కష్టాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి అనేకసార్లు తీసుకువెళ్లామని గుర్తుచేశారు. అధికారులు తక్షణమే స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతంగా ప్రారంభించాలని, లేనిపక్షంలో ప్రజాప్రయోజనాల కోసం ప్రత్యక్ష పోరాటానికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రజల ఇబ్బందులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, త్వరితగతిన పనులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు.

Related News Desk రాష్ట్రంలో మహిళల రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: హోం మంత్రి వంగలపూడి అనిత

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎస్కే నాగుల్ మీరా, ఒట్టికుంట కృష్ణ, డైరెక్టర్ మాధవరావు, మల్యాల పీఏసీఎస్ చైర్మన్ కస్తూరి సీతారామస్వామి, ఆరేపల్లి నవీన్, లింగినేని సుధాకర్, పర్షా పుల్లారావు, చెన్న కృష్ణారావు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను నాయకులు స్వయంగా పరిశీలించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజల రవాణా కష్టాలు పూర్తిగా తొలగిపోతాయని, రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Slug: gampalagudem-vinagadapa-kattaleru-bridge-funds-janasena