జన గళం ఏలూరు జిల్లా డెస్క్: భారతదేశ లోక్‌సభ మాజీ స్పీకర్, దివంగత నేత జి.యమ్.సి. బాలయోగి 75వ జయంతి వేడుకలను ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కైకలూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జీఎంసీ బాలయోగి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ పార్లమెంటరీ చరిత్రలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన బాలయోగి సేవలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు. పేదరికంలో జన్మించి తన అసాధారణ ప్రతిభతో దేశ అత్యున్నత చట్టసభకు స్పీకర్‌గా ఎదిగి ఆయన కీర్తిని సంపాదించారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కొత్త నాగేంద్ర కుమార్ (నాగబాబు), కైకలూరు ఏఎంసీ చైర్మన్ పెనుమత్స త్రినాధ్ రాజు, కో-కన్వీనర్ మరియు మండల టీడీపీ అధ్యక్షులు పి. రాధకృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని బాలయోగి విగ్రహానికి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం అందించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పైడిమర్రి జయ శ్యామల మాల్యాద్రి, కైకలూరు క్లస్టర్-5 కన్వీనర్ పోలవరపు లక్ష్మీరాణి, శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానము చైర్మన్ లక్కింశెట్టి రామమోహనరావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు పడమట వాసు పాల్గొని నివాళులు అర్పించారు. అలాగే వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటి డైరెక్టర్ ఎం.డి. ఉస్మాన్, యూనిట్ కన్వీనర్ ఎం.డి. జాని, దైతగుంజ రామస్వామి, కైకలూరు మండల పార్టీ ఉపాధ్యక్షుడు జహీర్, సయ్యద్ బాషీద్, ఏగిరెడ్డి సురేష్‌తో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై మహనీయుడిని స్మరించుకున్నారు.
Slug: kaikaluru-gmc-balayogi-75th-birth-anniversary-tributes-tdp-leaders
