జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా కైకలూరు ట్రావెలర్స్ బంగ్లాలో నియోజకవర్గ స్థాయి బీసీ ముఖ్య నాయకుల ప్రత్యేక సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో బీసీల రాజకీయ సాధికారత, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు మరియు పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగింది. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ వీరమల్లు నరసింహారావు అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రముఖ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సమావేశంలో ఎక్స్ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, పార్టీ కన్వీనర్ నాగబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ బీసీలకు రాజకీయంగా, సామాజికంగా సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ వస్తోందని గుర్తుచేశారు. రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించే దిశగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపడుతున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడంలో బీసీ నాయకుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కైకలూరు, కలిదిండి ఏఎంసీ చైర్మన్లు త్రిధ్ రాజ్, ఏడుకొండలు, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి మండలాల అధ్యక్షులు రాధాకృష్ణ, శ్రీనివాస్, సుందరరామయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలుగు యువత నాయకులు పూల రాజి, దావు నాగరాజు, బొంగు రవి, బొర్రా చలమయ్య, శ్రీహరిపురం సర్పంచ్ నల్లబాబు, కార్పొరేషన్ డైరెక్టర్లు అండ్రా రాజు, మాల్యాద్రి, లంక రత్నం, వాసుతో పాటు మహిళా నాయకులు లక్ష్మి రాణి, శ్రీదేవి, రామలక్ష్మి, సుధా, కృష్ణవేణి తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.
Slug: kaikaluru-tdp-bc-leaders-meeting-veeramallu-narasimha-rao
