జన గళం క్రీడా డెస్క్: జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో పాకిస్తాన్‌కు చెందిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్ ఆసిమ్ ఖాన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆదివారం జరిగిన పురుషుల మోడరన్ ఎంఎంఏ -60 కేజీల కేటగిరీ క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో కాంబోడియా క్రీడాకారుడు సోపన్హా ఫెంగ్‌ను చిత్తు చేసి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆసిమ్ ఖాన్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ విజయంతో అతను సెమీఫైనల్‌కు అర్హత సాధించడమే కాకుండా, తన దేశానికి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకునే దశకు చేరుకున్నాడు.
