జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: మచిలీపట్నం (బందరు) మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల పోరు ఊపందుకుంది. బందరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేయర్ అభ్యర్థిగా ఎంపికైన శ్రీ బూరగడ్డ వేద వ్యాస్‌ను కూటమి నాయకులు, ఆశావహులు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు తెలిపారు. బందరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు, ప్రజలకు సుపరిపాలన అందించేందుకు వేద వ్యాస్ నాయకత్వంలో పనిచేస్తామని నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీ బూరగడ్డ వేద వ్యాస్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, పొత్తులోని భాగస్వామ్య పార్టీల సమన్వయంతో క్షేత్రస్థాయి ప్రచారాన్ని వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నానికి చెందిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
