జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ కన్వీనర్‌గా ప్రముఖ న్యాయవాది శ్రీ సిద్ధినేని శ్రీ సత్యసాయిబాబు నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల మచిలీపట్నంతో పాటు జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
విశ్వహిందూ పరిషత్ కృష్ణా జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా, మచిలీపట్నం బార్ అసోసియేషన్ కార్యదర్శిగా, మాజీ ఏజీపీగా ఆయన న్యాయవాద వృత్తితో పాటు సామాజిక రంగంలో విశేష సేవలందించారు. న్యాయవాదుల సంక్షేమ సమస్యలను ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన యోధుడిగా గుర్తింపు పొందారు. నిత్యం ప్రజాసేవకే అంకితమైన సిద్ధినేని నియామకంపై మచిలీపట్నం పరిధిలోని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే (APUWJ) రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వి. మామిళ్ళయ్య గారు సిద్ధినేని శ్రీ సత్యసాయిబాబు గారికి మచిలీపట్నం మీడియా తరపున ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
