రచన: జన గళం బ్యూరో: అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ సోషల్ జస్టిస్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు అజయ్ వర్మ ఠాకూర్, జనసేన పార్టీ నాయకులు మద్దిల రామకృష్ణ పూలమాలలతో అలంకరించిన గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి మార్గాల ద్వారా దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. బాపూజీ చూపిన సేవా దృక్పథం, సమసమాజ స్థాపన ఆశయాలు నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. సమాజంలో అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేకూరాలని, గ్రామ స్వరాజ్యం, స్వచ్ఛత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
