జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: జనసేన పార్టీ నాయకులు, ప్రముఖ ఆక్వా రంగ పారిశ్రామికవేత్త శ్రీ లింగం నాగేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు శ్రీ ఇల్లూరి సుగుణబాబు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సుగుణబాబు మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగంలో తనదైన ముద్ర వేస్తూనే, జనసేన పార్టీ సిద్ధాంతాలు, అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సాధన కోసం శ్రీ లింగం నాగేశ్వరరావు గారు ఎనలేని సేవలందిస్తున్నారని కొనియాడారు. ఆ భగవంతుని దివ్య ఆశీస్సులతో నాగేశ్వరరావు గారు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. వ్యాపార రంగంతో పాటు సమాజ సేవలోనూ ఆయన ప్రయాణం మరింత దిగ్విజయంగా సాగాలని కోరుకున్నారు.
