వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు క్రియాశీలక జనసైనికుల కుటుంబాలకు జనసేన పార్టీ తరపున రూ.5 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్థానిక సాధక్స్, పార్టీ నాయకుల సమక్షంలో బాధిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయాన్ని అందజేసి పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పించారు. పాడేరు, మాచర్ల, గురజాల, నెల్లిమర్ల, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు చెందిన బాధిత కుటుంబ సభ్యులకు ఈ పరిహారం అందింది.
Slug: janasena-party-active-cadre-accidental-insurance-cheques-distribution-pawan-kalyan-5-lakhs
