జన గళం విజయవాడ డెస్క్: విజయవాడ నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున నూతన వాహన పూజలు నిర్వహించుకున్నారు. దసరా వేళ కొత్త వాహనాలు కొనుగోలు చేసిన భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన పూజా మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్, జనసేన పార్టీ నాయకులు శ్రీ సోడిశెట్టి కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ.. జగన్మాత దుర్గాదేవి విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి రోజున వాహన పూజలు చేసుకోవడం హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టమైనదని పేర్కొన్నారు. ఈ పవిత్ర దినాన ఆంజనేయ స్వామి, అమ్మవార్ల కృపతో పూజలు జరిపించుకోవడం వల్ల మార్గమధ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సురక్షిత ప్రయాణం, ఆయురారోగ్యాలు మరియు సర్వతోముఖాభివృద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసమని తెలిపారు. పూజల కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు, అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు ఆయన వెల్లడించారు.
