జన గళం విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీల ప్రక్రియ జోరందుకుంది. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్తగా శ్రీ మండలి రాజేష్ నియమితులయ్యారు. నియోజకవర్గ పరిధిలోని డివిజన్లు, వార్డు స్థాయిల్లో పార్టీ యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల సమన్వయం, విజయ వ్యూహాల అమలులో ఆయన ప్రధాన భూమిక పోషించనున్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేలా యువ నాయకత్వానికి ఈ కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని జనసేన పార్టీ శ్రేణులు, జనసైనికులు, వీరమహిళలు మరియు కూటమి నాయకులు విశేష హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా మండలి రాజేష్ నియామకం: పార్టీ శ్రేణుల ఘన స్వాగతం, హర్షాతిరేకాలు!
Slug: mandali-rajesh-appointed-janasena-co-ordinator-vijayawada-east-constituency
