జన గళం ఎన్టీఆర్ జిల్లా డెస్క్: మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మంగళవారం సెప్టెంబర్ 22న నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఉదయం 10 గంటలకు కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. కొండపల్లిలోని అనుమోలు కన్వెన్షన్ హాల్‌లో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు జి.కొండూరు మండలం పినపాక గ్రామంలోని ఎస్సీ ప్రాంతంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు కందులపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించనున్నారు.
సాయంత్రం 4.30 గంటలకు ఆత్కూరు గ్రామంలో రూ.25 లక్షలతో కమ్యూనిటీ హాల్, రూ.15 లక్షలతో సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు జి.కొండూరులో స్మశానవాటికకు వెళ్లే మార్గంలో పులివాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జి.కొండూరులో రజకుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.
