Title: సమాజ సంస్కర్త, బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు 164వ జయంతి: ఆయన సేవలు చిరస్మరణీయం!
రచన: జన గళం డెస్క్: ఆధునిక ఆంధ్రప్రదేశ్ విద్యా వికాసానికి, సామాజిక సమరసతకు బలమైన బాటలు వేసిన మహనీయుడు, బ్రహ్మర్షి సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు 164వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులర్పించారు. సమాజ సంస్కరణే ఊపిరిగా, అణగారిన వర్గాల ఉన్నతే ధ్యేయంగా జీవితాంతం కృషి చేసిన ఆయన కాపు సామాజిక వర్గానికే కాకుండా యావత్ తెలుగు జాతికే గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. విద్యారంగంలో ఆయన చేసిన సేవలు, దళిత మరియు అనాథ పిల్లల సంక్షేమం కోసం తీసుకున్న సంస్కరణాత్మక చర్యలు సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
