రాజకీయ పార్టీలకు వెన్నెముక వంటి కార్యకర్తలకు సమాన గౌరవం కల్పించడంతో పాటు వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తిరువూరు పూర్ణయ్య టౌన్‌షిప్‌లోని తన కార్యాలయం వద్ద శనివారం ‘కార్యకర్తలే కాంట్రాక్టర్లు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరయ్యాయని, గ్రామీణ మౌలిక వసతులు, అంతర్గత సీసీ రహదారుల నిర్మాణ పనుల్లో క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు.
Slug: tiruvuru-mla-kolikapudi-srinivasa-rao-karyakarthale-contractors-10-crores-funds-development-works
