బ్రేకింగ్ న్యూస్
మహానాడు రోడ్డులో చిన్నపాటి చినుకులకే జలదిగ్బంధం: జెమినీ భవన్ వద్ద నిలిచిన వరద నీరు.. నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు, పాదచారులు!గుడివాడలో భారీ వర్షాలు: అధికారులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము టెలీకాన్ఫరెన్స్.. విపత్తు తగ్గే వరకు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం!రాజంపేటలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు: యల్లటూరు శ్రీనివాసరాజు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న 150 కుటుంబాలు!ప్రమాదం చెప్పి రాదు.. అప్రమత్తతే రక్షణ!కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యానికి సామినేని ఉదయభాను నివాళులుప్రజల భద్రతే తొలి ప్రాధాన్యత.. అప్రమత్తంగా ఉండండితిరువూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు.. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే కొలికపూడిచోడవరం చెరకు రైతులకు కేబినెట్ తీపి కబురు: రూ. 28 కోట్ల బకాయిల విడుదలకు ఆమోదం.. సీఎం, డిప్యూటీ సీఎంలకు జనసేన ఎమ్మెల్సీ ధన్యవాదాలు!పేద విద్యార్థి ఉన్నత చదువుకు మెగా యూత్ ఫోర్స్ భరోసా: ఇంజనీరింగ్ విద్యార్థికి రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందజేత!ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!మహానాడు రోడ్డులో చిన్నపాటి చినుకులకే జలదిగ్బంధం: జెమినీ భవన్ వద్ద నిలిచిన వరద నీరు.. నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు, పాదచారులు!గుడివాడలో భారీ వర్షాలు: అధికారులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము టెలీకాన్ఫరెన్స్.. విపత్తు తగ్గే వరకు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం!రాజంపేటలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు: యల్లటూరు శ్రీనివాసరాజు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న 150 కుటుంబాలు!ప్రమాదం చెప్పి రాదు.. అప్రమత్తతే రక్షణ!కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యానికి సామినేని ఉదయభాను నివాళులుప్రజల భద్రతే తొలి ప్రాధాన్యత.. అప్రమత్తంగా ఉండండితిరువూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు.. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే కొలికపూడిచోడవరం చెరకు రైతులకు కేబినెట్ తీపి కబురు: రూ. 28 కోట్ల బకాయిల విడుదలకు ఆమోదం.. సీఎం, డిప్యూటీ సీఎంలకు జనసేన ఎమ్మెల్సీ ధన్యవాదాలు!పేద విద్యార్థి ఉన్నత చదువుకు మెగా యూత్ ఫోర్స్ భరోసా: ఇంజనీరింగ్ విద్యార్థికి రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందజేత!ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!
ఆంధ్ర

పమిడిముక్కలలో ప్రజాప్రతినిధులకు ఘనంగా వీడ్కోలు.. రూ.5.50 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి

pamidimukkala-mandal-parishad-representatives-felicitation-ceremony
పమిడిముక్కలలో ప్రజాప్రతినిధులకు ఘనంగా వీడ్కోలు.. రూ.5.50 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా పమిడిముక్కల మండల ప్రజాప్రతినిధుల ఐదేళ్ల పదవీ కాలం విజయవంతంగా ముగిసిన సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో వీడ్కోలు మరియు సన్మాన సభ ఘనంగా జరిగింది. ఎంపీడీవో వి. సీతారామరాజు ఆధ్వర్యంలో మండల పరిషత్ అధికారులు, సిబ్బంది స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అలాగే మండల పార్టీ అధ్యక్షులు ఎలమంచిలి గణేష్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఆత్మీయంగా అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎంపీపీ కాసాని వేద సుప్రజా మాట్లాడుతూ తమ ఐదేళ్ల పాలనా కాలంలో సుమారు 5 కోట్ల 50 లక్షల రూపాయల ప్రత్యేక గ్రాంట్ నిధులతో మండల పరిధిలో పలు అభివృద్ధి పనులను దిగ్విజయంగా పూర్తి చేశామని వెల్లడించారు. రాజకీయ పార్టీలు, కులాలకు అతీతంగా కేవలం అభివృద్ధిని మాత్రమే ధ్యేయంగా పెట్టుకుని ప్రజలకు సేవలందించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. అనంతరం జడ్పీటీసీ సభ్యురాలు యేనుగ వెంకటరమణ కుమారి మాట్లాడుతూ పాలకవర్గ సభ్యులంతా సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి తమ వంతుగా పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశామని తెలిపారు.

వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని రీతిలో మండలంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. ముఖ్యంగా పల్లెల్లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, సబ్-మెర్సిబుల్ బోర్లు, తాగునీటి చేతిపంపులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాల భవనాలు, అంతర్గత సీసీ రోడ్లు, మెటల్ రోడ్ల నిర్మాణం మరియు శ్మశాన వాటికల అభివృద్ధి పనులను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. తమ పదవీ కాలంలో మండలాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు సంపూర్ణంగా సహకరించిన మండల ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Related News Desk మహానాడు రోడ్డులో చిన్నపాటి చినుకులకే జలదిగ్బంధం: జెమినీ భవన్ వద్ద నిలిచిన వరద నీరు.. నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు, పాదచారులు!

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో తావీర్య, ఏవో గోలి రామకృష్ణ, మండల కో-ఆప్షన్ సభ్యులు మీర్జా దియానత్ అలీ, నాయకులు ఏనుగ మస్తాన్రావు, కాసాని శ్రీనివాసరావు, పోలిమెట్ల వంశీకృష్ణ, గొర్కిపూడి బుజ్జి, కొనతం శివరామకృష్ణ, తిరుమలశెట్టి బోసు బాబు, బొల్లా సాంబశివరావు, కోట మణిరాజ్ లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Slug: pamidimukkala-mandal-parishad-representatives-felicitation-ceremony