బ్రేకింగ్ న్యూస్
ప్రమాదం చెప్పి రాదు.. అప్రమత్తతే రక్షణ!కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యానికి సామినేని ఉదయభాను నివాళులుప్రజల భద్రతే తొలి ప్రాధాన్యత.. అప్రమత్తంగా ఉండండితిరువూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు.. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే కొలికపూడిచోడవరం చెరకు రైతులకు కేబినెట్ తీపి కబురు: రూ. 28 కోట్ల బకాయిల విడుదలకు ఆమోదం.. సీఎం, డిప్యూటీ సీఎంలకు జనసేన ఎమ్మెల్సీ ధన్యవాదాలు!పేద విద్యార్థి ఉన్నత చదువుకు మెగా యూత్ ఫోర్స్ భరోసా: ఇంజనీరింగ్ విద్యార్థికి రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందజేత!ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జనసేన నేత అమ్మిశెట్టి వాసు!తుఫాను ప్రభావం.. కృష్ణాజిల్లాలో పాఠశాలలకు సెప్టెంబర్ 24న స్థానిక సెలవుమంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ‘జనవాణి’: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేతలు!ప్రమాదం చెప్పి రాదు.. అప్రమత్తతే రక్షణ!కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యానికి సామినేని ఉదయభాను నివాళులుప్రజల భద్రతే తొలి ప్రాధాన్యత.. అప్రమత్తంగా ఉండండితిరువూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు.. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే కొలికపూడిచోడవరం చెరకు రైతులకు కేబినెట్ తీపి కబురు: రూ. 28 కోట్ల బకాయిల విడుదలకు ఆమోదం.. సీఎం, డిప్యూటీ సీఎంలకు జనసేన ఎమ్మెల్సీ ధన్యవాదాలు!పేద విద్యార్థి ఉన్నత చదువుకు మెగా యూత్ ఫోర్స్ భరోసా: ఇంజనీరింగ్ విద్యార్థికి రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందజేత!ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జనసేన నేత అమ్మిశెట్టి వాసు!తుఫాను ప్రభావం.. కృష్ణాజిల్లాలో పాఠశాలలకు సెప్టెంబర్ 24న స్థానిక సెలవుమంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ‘జనవాణి’: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేతలు!
ఆంధ్ర

మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సంచలనం.. 51 మందిపై రౌడీషీట్లు తెరవాలని పోలీసులకు ఆదేశాలు

mangalagiri-tdp-office-attack-case-rowdy-sheets-ordered-on-51-accused-ntr-commissionerate
మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సంచలనం.. 51 మందిపై రౌడీషీట్లు తెరవాలని పోలీసులకు ఆదేశాలు

జన గళం క్రైమ్ డెస్క్: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై గతంలో జరిగిన దాడి కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దాడి ఘటనలో ప్రమేయమున్న 51 మంది నిందితులపై రౌడీషీట్లు తెరవాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 650/2021 కింద నమోదైన పలు తీవ్రమైన నేర సెక్షన్ల కేసు ఆధారంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఈ మేరకు అధికారికంగా మెమో విడుదల చేసింది. నిందితుల నేర తీవ్రత, శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలకు ఉపక్రమించారు.

ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసిస్తున్న నిందితులపై సంబంధిత అధికారులు తక్షణమే రౌడీషీట్లు ప్రారంభించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. భవానీపురం, అజిత్ సింగ్ నగర్, నున్న, కృష్ణలంక, మాచవరం, పటమట, గవర్నర్పేట, గుణదల, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు తమ పరిధిలోని నిందితులపై రౌడీషీట్లు తెరిచి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ లా అండ్ ఆర్డర్ ఏసీపీలు స్వయంగా పర్యవేక్షించాలని పోలీస్ కమిషనరేట్ ఆదేశించింది.

పోలీసులు రౌడీషీట్లు తెరవాలని ఆదేశించిన 51 మంది జాబితాలో వైఎస్సార్సీపీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులు, ప్రముఖ నేతల పేర్లు ఉండటం సంచలనంగా మారింది. ప్రధానంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే దేవినేని అవినాష్ లతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం దర్యాప్తును వేగవంతం చేసి నిందితులపై చట్టపరమైన చర్యలను మరింత కఠినతరం చేస్తోంది.

Related News Desk ప్రమాదం చెప్పి రాదు.. అప్రమత్తతే రక్షణ!

Slug: mangalagiri-tdp-office-attack-case-rowdy-sheets-ordered-on-51-accused-ntr-commissionerate