అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పరిపాలన, శాంతిభద్రతలు మరియు రాజధాని అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణను మరింత కట్టుదిట్టం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, మరియు కర్నూలు కేంద్రాలుగా నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఆయా ప్రాంతాల్లో పోలీసు పరిపాలన మరింత బలోపేతం కావడంతో పాటు, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం వెల్లడించింది.
అమరావతిలో మౌలిక వసతులకు నిధులు రాజధాని అమరావతి అభివృద్ధికి మంత్రివర్గం భారీ ఊరటనిచ్చింది. రాజధాని ప్రాంతం పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల కోసం ఏకంగా రూ. 1,548.98 కోట్లతో పరిపాలనా అనుమతులను మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. తద్వారా అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం కానున్నాయి.
SLUG: AP Cabinet approves the formation of four new police commissionerates and sanctions Rs 1,548.98 crore for infrastructure development in Amaravati villages.
