బ్రేకింగ్ న్యూస్
హనుమాన్ అంశ్ తెలుగు టీజర్ విడుదల సమయం ఖరారుప్రధాని మోదీని కలిసిన మాజీ సహచరుడు.. భూ ఆక్రమణపై సీబీఐ విచారణ కోరుతూ వినతి2029లోపు ఎన్‌డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమలు: కేంద్ర హోంమంత్రి అమిత్ షామార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్‌ హెక్టార్‌ కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.21.79 లక్షలుఇండోనేషియాలో ఘోర నౌక ప్రమాదం.. జావా సముద్రంలో మునిగిన వెర్గో ట్రాన్స్‌పోర్ట్ 8ఒడిశా జూలో అరుదైన ఒరంగుటాన్ పిల్లలకు సంగీత చికిత్సబ్యాంకు డిపాజిట్లలో భారీ వృద్ధి, ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ డిపాజిట్లే కారణంటాటా సన్స్‌కు ఆర్బీఐ షాక్.. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్ రద్దు దరఖాస్తు తిరస్కరణజీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల నిరసన.. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఊరుకోమంటూ ఆవేదనకాంగ్రెస్ వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి స్పష్టతహనుమాన్ అంశ్ తెలుగు టీజర్ విడుదల సమయం ఖరారుప్రధాని మోదీని కలిసిన మాజీ సహచరుడు.. భూ ఆక్రమణపై సీబీఐ విచారణ కోరుతూ వినతి2029లోపు ఎన్‌డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమలు: కేంద్ర హోంమంత్రి అమిత్ షామార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్‌ హెక్టార్‌ కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.21.79 లక్షలుఇండోనేషియాలో ఘోర నౌక ప్రమాదం.. జావా సముద్రంలో మునిగిన వెర్గో ట్రాన్స్‌పోర్ట్ 8ఒడిశా జూలో అరుదైన ఒరంగుటాన్ పిల్లలకు సంగీత చికిత్సబ్యాంకు డిపాజిట్లలో భారీ వృద్ధి, ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ డిపాజిట్లే కారణంటాటా సన్స్‌కు ఆర్బీఐ షాక్.. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్ రద్దు దరఖాస్తు తిరస్కరణజీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల నిరసన.. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఊరుకోమంటూ ఆవేదనకాంగ్రెస్ వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి స్పష్టత
బిజినెస్

బ్యాంకు డిపాజిట్లలో భారీ వృద్ధి, ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ డిపాజిట్లే కారణం

బ్యాంకు డిపాజిట్లలో భారీ వృద్ధి, ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ డిపాజిట్లే కారణం

బిజినెస్ డెస్క్: గడచిన నెలలో దేశీయ బ్యాంకింగ్ రంగంలో డిపాజిట్లు గణనీయమైన స్థాయిలో వృద్ధిని నమోదు చేశాయి. గడిచిన పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో ఏకంగా 17.8 శాతం వృద్ధి వచ్చినట్లు వెల్లడైంది. గల్ఫ్ యుద్ధం కారణంగా తగ్గిపోతున్న ఫారెక్స్ నిల్వలను కాపాడుకోవడానికి, అలాగే విదేశీ మదుపర్లను ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఫారిన్ కరెన్సీ నాన్-సెరడెంట్ బ్యాంక్ లేదా ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ డిపాజిట్లు ఈ రికార్డు వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచాయి.

కేవలం రెండున్నర నెలల వ్యవధిలోనే ప్రవాస భారతీయులు విదేశీ కరెన్సీ ఆధారిత నాన్-రెసిడెంట్ డిపాజిట్లలో ఏకంగా 126 బిలియన్ డాలర్లను జమ చేశారు. దీంతో గతంలో ఒక నెలలో నమోదైన 15.4 శాతం డిపాజిట్ల వృద్ధి రికార్డు వెనక్కి తగ్గిపోయింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ ద్వారా వచ్చిన డిపాజిట్లలో 48.5 శాతం ఐదేళ్ల కాలపరిమితి కలిగినవే కాగా, మరో 42 శాతం మూడేళ్లకు, మిగిలినవి నాలుగేళ్లకు సంబంధించినవిగా ఉన్నాయి. ఆగస్టు 31తో ముగిసిన పదిహేను రోజుల కాలంలో బ్యాంక్ డిపాజిట్లకు నికరంగా మరో రూ.9.4 లక్షల కోట్లు జత కలవడంతో మొత్తం డిపాజిట్లు రూ.278.7 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్‌ హెక్టార్‌ కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.21.79 లక్షలు

ఒకవైపు ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ డిపాజిట్లతో బ్యాంకులకు తాత్కాలికంగా ఊరట లభించినప్పటికీ, దేశీయంగా స్థానిక మదుపర్లు మాత్రం రాబడుల కోసం మార్కెట్ ఆధారిత సాధనాల వైపే మొగ్గు చూపుతున్నారు. సంప్రదాయ మదుపర్లు కూడా సురక్షితమైన బ్యాంకు డిపాజిట్లను పక్కనపెట్టి, ఒడిదుడుకులతో కూడిన ఈక్విటీ పెట్టుబడులపై ఆసక్తి చూపుతుండటం గమనార్హం. ఇక క్రితం ఏడాదితో పోలిస్తే గత నెలలో రుణ వృద్ధి 19.1 శాతంగా నమోదు కాగా, జూలై ఆఖరు నాటికి అది 19.4 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది. తాజా లెక్కల ప్రకారం మొత్తం రుణ బకాయిలు రూ.223.9 లక్షల కోట్లుగా ఉండగా, క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి 80.32 శాతంగా నమోదైంది.