జన గళం క్రైమ్ డెస్క్: చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పై అసత్య ప్రచారాలు చేస్తూ, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న స్థానిక యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రగడవరం పంచాయతీ కూటమి నాయకులు చింతలపూడి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌కు బాధ్యులైన నాయకులు అందరూ కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేక కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
చింతలపూడిని బంగారు చింతలపూడిగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని, ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని నాయకులు తెలిపారు. అయితే, బీఆర్కే యూట్యూబ్ ఛానెల్లో లోకల్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న సత్య మాత్రం ప్రజల్లో అభూతకల్పనలు సృష్టించేలా, ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెంచే దుర్ఉద్దేశంతో నిరంతరం అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత కక్షలతో లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వారు ఆరోపించారు.
ప్రజా ప్రతినిధులపై ఇలాంటి నిరాధార ఆరోపణలు, బ్లాక్‌మెయిలింగ్ సంస్కృతిని తీవ్రంగా ఖండిస్తున్నామని కూటమి నాయకులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు సేవ చేస్తున్న నాయకులపై తప్పుడు ప్రచారాలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని వారు పోలీసులను కోరారు. బేతి మహాలక్ష్ముడు, నల్లగోపు కృష్ణమూర్తి, మానేపల్లి రాజారావు, చక్రపు మారేశ్వరరావు, మోచర్ల రవి, సరిపల్లి కిరణ్ కుమార్, సరిపల్లి వెంకటేశ్వరరావు తదితర కూటమి నాయకులు ఈ ఫిర్యాదులో పాల్గొన్నారు. ఈ ఘటనపై చట్టపరమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
Slug: chintalapudi-mla-songa-roshan-kumar-youtube-reporter-complaint-2026
