ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకల విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజలు చేపట్టే ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. ప్రజలందరి ఇళ్లలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, అష్టైశ్వర్యాలు నిండాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం, నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలంతా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజానీకానికి, జనసేన-కూటమి శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
