కృష్ణా జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు తాటినేని శ్రీరామ్
- ఆ విఘ్నేశ్వరుని కృపతో ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు నిండాలి
- పర్యావరణ హితంగా మట్టి వినాయకులనే పూజిద్దాం: తాటినేని శ్రీరామ్ పిలుపు
మచిలీపట్నం / కృష్ణా జిల్లా:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ తాటినేని శ్రీరామ్ జిల్లా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, ఎన్డీయే కూటమి శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకల విఘ్నాలను తొలగించి కార్యసిద్ధిని ప్రసాదించే ఆ విఘ్ననాయకుడి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. సమాజంలోని ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆలోచనలకు అనుగుణంగా దేశం, రాష్ట్రం మరియు కృష్ణా జిల్లా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుంటూనే, పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. పవిత్రమైన వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని శ్రీ తాటినేని శ్రీరామ్ కోరారు.
