బ్రేకింగ్ న్యూస్
శ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!పవిత్రమైన శ్రీ వినాయక చవితి పండగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! 🌸🙏🌸 గుడివాడలో వాడవాడలా వైభవంగా వినాయక చవితి వేడుకలు! 🌸విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో యువత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… 🌸🙏శ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!పవిత్రమైన శ్రీ వినాయక చవితి పండగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! 🌸🙏🌸 గుడివాడలో వాడవాడలా వైభవంగా వినాయక చవితి వేడుకలు! 🌸విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో యువత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… 🌸🙏
ఆంద్ర ప్రదేశ్

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

Screenshot

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

  • విఘ్నాలు తొలగి ప్రతి ఇంటా సుఖసంతోషాలు, సమృద్ధి నిండాలని ఆకాంక్ష
  • గుంటూరు ప్రగతి పథంలో దూసుకుపోవాలని గణనాథుడికి ప్రార్థన
  • పర్యావరణ హితంగా మట్టి వినాయకులనే పూజిద్దాం: కేంద్ర సహాయ మంత్రి పిలుపు

గుంటూరు / న్యూఢిల్లీ:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖల సహాయ మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు, రాష్ట్ర ప్రజానీకానికి, ఎన్డీయే కూటమి శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Related News Desk పత్రికా ప్రకటన

​ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. సకల విఘ్నాలను తొలగించి కార్యసిద్ధిని అనుగ్రహించే ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని కోరుకున్నారు. ప్రజలు తలపెట్టే ప్రతి సత్కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని గణనాథుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం, గుంటూరు ప్రాంతం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మరింత వేగంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

​మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూనే, భావితరాల భవిష్యత్తు కోసం పర్యావరణ పరిరక్షణను ఒక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలకు బదులుగా మట్టితో చేసిన వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించి పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు.