బ్రేకింగ్ న్యూస్
అన్నమయ్య జిల్లాలో కత్తిపీటతో భీకర దాడి.. కుటుంబ కలహాలతో వ్యక్తిపై మహిళ దాడి, తీవ్రగాయాలుసోమవారం మచిలీపట్నంలో ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. అర్జీలు స్వీకరించనున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పర్యటన వివరాలు.. నేడు పలు అభివృద్ధి, సేవా కార్యక్రమాలలో పాల్గొననున్న మాజీ మంత్రిపెడన నియోజకవర్గంలో పరామర్శలు.. పలువురు మృతుల కుటుంబాలను ఓదార్చిన వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ ఉప్పాల రాముపేదల సొంతింటి కలకు 3D కాంక్రీట్ టెక్నాలజీతో సరికొత్త బాట.. తెనాలిలో వంద పక్కా ఇళ్ల నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపనసామాన్యులకు భారీ ఊరట.. తెనాలి రైతుబజార్‌లో కిలో ఉల్లిపాయలు రూ. 35 కే విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో ఘనంగా ఉచిత మెగా కంటి వైద్య శిబిరం.. 234 మందికి పరీక్షలు, 26 మందికి శుక్లం శస్త్రచికిత్సలకు ఎంపికబుర్రిపాలెంలో చారిత్రాత్మక 3D ప్రింటింగ్ ఇళ్ల శంకుస్థాపనగాళ్ళ సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభలో ఘన నివాళి: జాతీయ కాపునాడు దివంగత అధ్యక్షుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన పులిగడ్డ సత్యనారాయణ, వ్యవస్థాపకులు, కాపు చైతన్య రథం!మైసూర్ దసరా తరహాలో ‘విజయవాడ ఉత్సవ్ 2.0’: అక్టోబర్ 11 నుంచి 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు.. పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొండా ఉమా, బొండా సిద్ధార్థ!అన్నమయ్య జిల్లాలో కత్తిపీటతో భీకర దాడి.. కుటుంబ కలహాలతో వ్యక్తిపై మహిళ దాడి, తీవ్రగాయాలుసోమవారం మచిలీపట్నంలో ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. అర్జీలు స్వీకరించనున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పర్యటన వివరాలు.. నేడు పలు అభివృద్ధి, సేవా కార్యక్రమాలలో పాల్గొననున్న మాజీ మంత్రిపెడన నియోజకవర్గంలో పరామర్శలు.. పలువురు మృతుల కుటుంబాలను ఓదార్చిన వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ ఉప్పాల రాముపేదల సొంతింటి కలకు 3D కాంక్రీట్ టెక్నాలజీతో సరికొత్త బాట.. తెనాలిలో వంద పక్కా ఇళ్ల నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపనసామాన్యులకు భారీ ఊరట.. తెనాలి రైతుబజార్‌లో కిలో ఉల్లిపాయలు రూ. 35 కే విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో ఘనంగా ఉచిత మెగా కంటి వైద్య శిబిరం.. 234 మందికి పరీక్షలు, 26 మందికి శుక్లం శస్త్రచికిత్సలకు ఎంపికబుర్రిపాలెంలో చారిత్రాత్మక 3D ప్రింటింగ్ ఇళ్ల శంకుస్థాపనగాళ్ళ సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభలో ఘన నివాళి: జాతీయ కాపునాడు దివంగత అధ్యక్షుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన పులిగడ్డ సత్యనారాయణ, వ్యవస్థాపకులు, కాపు చైతన్య రథం!మైసూర్ దసరా తరహాలో ‘విజయవాడ ఉత్సవ్ 2.0’: అక్టోబర్ 11 నుంచి 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు.. పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొండా ఉమా, బొండా సిద్ధార్థ!
రాజకీయం

కూటమి పాలనలో ఆధ్యాత్మిక రంగానికి స్వర్ణయుగం.. మచిలీపట్నంలో టీడీపీ నేతలు గొర్రెపాటి గోపీచంద్, ఫణికుమార్ వెల్లడి

kootami-government-golden-era-spiritual-sector-machilipatnam
కూటమి పాలనలో ఆధ్యాత్మిక రంగానికి స్వర్ణయుగం.. మచిలీపట్నంలో టీడీపీ నేతలు గొర్రెపాటి గోపీచంద్, ఫణికుమార్ వెల్లడి

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సరికొత్త ప్రజా పాలనను అందిస్తూ ఆధ్యాత్మిక రంగంలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ మరియు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పి.వి. ఫణి కుమార్ స్పష్టం చేశారు. మచిలీపట్నం నగర కార్పొరేషన్ పరిధిలోని నలభై ఐదవ డివిజన్ సిడింబి అగ్రహారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో అరాచకం, విధ్వంసానికి గురైన దేవాలయాలను సమూలంగా ప్రక్షాళన చేస్తూ, భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగాయని, ముఖ్యంగా కృష్ణాజిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర సారథ్యంలో బీచ్ వద్ద ఏర్పాటు చేసిన అరవై మూడు అడుగుల గణనాథుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని పేర్కొన్నారు.

గతంలో దేవాలయాలపై జరిగిన దాడులు, అపవిత్రతలను సరిదిద్దుతూ తిరుమల శ్రీవారి లడ్డుతో పాటు రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ప్రసాదాల తయారీని కూటమి ప్రభుత్వం పగడ్బందీగా అమలు చేస్తోందని నేతలు వెల్లడించారు. సీఎం చంద్రబాబు సుపరిపాలనపై నమ్మకంతో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు భక్తుల రాక డెబ్బై శాతానికి పైగా పెరిగిందని తెలిపారు. విఐపి బ్రేక్ దర్శనాల సమయాన్ని తగ్గించి సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా ఆలయాలలో నిత్య అన్నదానం ద్వారా రోజుకు వేలాది మందికి నాణ్యమైన ప్రసాదం అందిస్తున్నామని చెప్పారు. ఆలయ భూముల పరిరక్షణ, డిజిటలైజేషన్ మరియు ఆధునిక టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.

Related News Desk సోమవారం మచిలీపట్నంలో ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. అర్జీలు స్వీకరించనున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గౌరవ వేతనాన్ని పది వేల రూపాయలకు పెంచడంతో పాటు, నిరుద్యోగ వేద పండితులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల భజన మందిరాల నిర్మాణం, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌ను దేవాదాయ శాఖ పరిధిలోకి తెవడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలను హరిత పుష్కరాలుగా అద్భుతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవాడ ఉత్సవ్ పేరిట అంతర్జాతీయ స్థాయిలో, సర్వమత సామరస్యాన్ని ప్రతిబింబించేలా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పరస వాసు తదితరులు పాల్గొన్నారు.

Slug: kootami-government-golden-era-spiritual-sector-machilipatnam