రచన: జన గళం విజయవాడ బ్యూరో: జాతీయ కాపునాడు అధ్యక్షులు కీర్తిశేషులు శ్రీ గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ కార్యక్రమం విజయవాడలో అత్యంత భావోద్వేగపూరిత వాతావరణంలో జరిగింది. ఈ సంస్మరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నాయకుడు పులిగడ్డ సత్యనారాయణ, వ్యవస్థాపకులు, కాపు చైతన్య రథం, గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి చిత్రపటానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి, రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఉల్లిగడ్డ సత్యనారాయణ మాట్లాడుతూ.. కాపు సామాజిక వర్గ ఐక్యతకు, హక్కుల సాధనకు, అణగారిన వర్గాల ఉన్నతికి గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు జీవితాంతం చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆయన నిస్వార్థ నాయకత్వం, పోరాట పటిమ సమాజానికి నిరంతర స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం గారి అకాల మృతి సమాజానికి, కాపునాడు ఉద్యమానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు అందించే నిజమైన శ్రద్ధాంజలి అని స్పష్టం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
