విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా విశేష పూజలు, మహాగణపతి హోమం నిర్వహించారు.
ఈ వేడుకల్లో దుర్గగుడి దేవస్థానం చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఆలయ ఈవో శ్రీ వి.కె. సీనా నాయక్, పాలకమండలి సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద వితరణ ఏర్పాట్లను పకడ్బందీగా పర్యవేక్షించారు. 🙏✨
#VinayakaChavithi #Indrakeeladri #DurgaTemple #Vijayawada #LakshmiGanapathi #HappyGaneshChaturthi #KanakaDurgaTemple
