జన గళం లండన్/హైదరాబాద్ బ్యూరో: అంతర్జాతీయ వాణిజ్య రంగంలో తెలుగు పారిశ్రామికవేత్తలను, సాంకేతిక నిపుణులను అనుసంధానించే దిశగా ‘సమైఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (SAMAKHYA 2026) మరో కీలక మైలురాయిని అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వారధులను నిర్మిస్తూ, సమైఖ్యను విశ్వవ్యాప్తం చేసే కార్యక్రమంలో భాగంగా యునైటెడ్ కింగ్డమ్ (UK) కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రతిష్టాత్మక అసోసియేట్ సభ్యులు మరియు గ్లోబల్ బిజినెస్ డెలిగేట్స్ జాబితాను అధికారికంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు యూకేలో తమ విజయకేతనం ఎగురవేస్తూ సమైఖ్య అంతర్జాతీయ నెట్వర్క్లో చేరారు.
యూకేలోని ప్రముఖ లాజిస్టిక్స్, ఐటీ, ఏవియేషన్, బ్యాంకింగ్, ఫర్నిచర్ రంగాలలో రాణిస్తున్న దిగ్గజాలు ఈ డెలిగేట్స్ జాబితాలో ఉన్నారు. విశాఖపట్నానికి చెందిన కళ్యాణ్ దీవనపల్లి (ల్యాజిస్ట్రీమ్ లిమిటెడ్ ఫౌండర్ & డైరెక్టర్), శ్రీనివాస్ పల్లి (త్రిగుణ వెంచర్స్), మోహన్ రావు మొండేటి (ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్), కిషోర్ పంజా (కోజెంట్ బైట్స్ ఎండీ); హైదరాబాద్కు చెందిన సోమ పెమ్మిరెడ్డి (వాయు ఏవియేషన్ ఎండీ), రోహిత్ అద్దేపల్లి (బ్యాంక్ ఆఫ్ అమెరికా డైరెక్టర్ & చీఫ్ ఆఫ్ స్టాఫ్); అమలాపురానికి చెందిన కేశవ్ కొల్లా (జెనీషా కో-ఫౌండర్); అనపర్తికి చెందిన సతీష్ పినిశెట్టి (డిజిటల్ వెంచర్స్); మదనపల్లెకు చెందిన నల్లొల్ల సుబ్రమణ్యం (ఆర్ఆర్ ఫర్నిచర్స్); రాజమండ్రికి చెందిన శ్రీనివాస్ మారిశెట్టి (రితయ లిమిటెడ్ కో-ఫౌండర్); భీమవరానికి చెందిన కనకయ్య పేరికల / తాతాజీ (వెంచురా యూకే టెక్నాలజీస్ డైరెక్టర్)లు సమైఖ్య యూకే ప్రతినిధులుగా నియమితులయ్యారు. ఈ గ్లోబల్ నెట్వర్క్ ద్వారా అంతర్జాతీయ వ్యాపార భాగస్వామ్యాలు, స్టార్టప్లకు మార్గదర్శకత్వం, పెట్టుబడుల ఆకర్షణ మరింత వేగవంతం కానుందని సమైఖ్య ప్రతినిధులు వెల్లడించారు.
