జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా & ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ల సుపరిపాలనా సారథ్యంలో గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె పండుగ – 3.0’ కార్యక్రమం ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా కైకలూరు మండలం, కైకలూరు పట్టణంలో రూ. 60 లక్షల భారీ వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా హామీల కమిటీ ఛైర్మన్, మాజీ మంత్రి, కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు తెలుగుదేశం పార్టీ క్లస్టర్-5 కన్వీనర్ పోలవరపు లక్ష్మీరాణి, రాష్ట్ర తెలుగుయువత నాయకులు పూల రామచంద్రరావు (రాజీ), టీడీపీ నాయకులు వీరాబత్తిన సుధ, జనసేన పార్టీ నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబి), శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానము ఛైర్మన్ లక్కింశెట్టి రామమోహనరావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు పడమట వాసు, అద్దేపల్లి బ్రహ్మాజీ, ఆచంట వినయ్, జక్కా శివాజీ, యానాల బసవయ్య, గ్రామ పంచాయతీ కార్యనిర్వహక కార్యదర్శి ఫణి రాజకుమారి, కాంట్రాక్టర్ నరసింహమూర్తి, బుర్ల సత్యనారాయణ, వివిధ పాత్రికేయ సంఘాల నాయకులు, కరకట్ట ప్రాంత స్థానిక ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పల్లెసీమల రూపురేఖలను సమూలంగా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోందని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘పల్లె పండుగ’ ద్వారా ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతులు మెరుగవుతున్నాయని తెలిపారు. ఈ సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో అత్యంత వేగంగా పూర్తి చేసి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు మరియు కాంట్రాక్టర్ నరసింహమూర్తికి సూచించారు. నూతన రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేయడం పట్ల కరకట్ట ప్రాంత ప్రజలు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Slug: kaikaluru-palle-panduga-3-cc-road-bhoomi-pooja-kamineni-srinivas
