జన గళం విజయవాడ సెంట్రల్ బ్యూరో: భారత గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ, దేశ రక్షణ, సార్వభౌమాధికారం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న భారత వాయుసేన (IAF) వీరులకు ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు వాయుసేన దినోత్సవ (Indian Air Force Day) శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశాన్ని కాపాడే వీరుల ధైర్యసాహసాలు, త్యాగనిరతి ప్రతి భారతీయుడికీ గర్వకారణమని ఆయన కొనియాడారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ.. యుద్ధ సమయాల్లో శత్రువుల గుండెల్లో నిద్రపోవడమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాలు మరియు ఆపద సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడటంలో భారత వాయుసేన అందిస్తున్న సేవలు అసమానమైనవని పేర్కొన్నారు. దేశ భద్రత కోసం అహర్నిశలు సేవలందిస్తున్న వాయుసేన జవాన్లకు, వారి కుటుంబాలకు యావత్ దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు. మన గగనతల సరిహద్దులను సురక్షితంగా ఉంచుతున్న వీర సైనికులందరికీ ఆయన హృదయపూర్వక వందనాలు సమర్పించారు.
