జన గళం కృష్ణా బ్యూరో: ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తూ, సమాజ శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేస్తున్న నిస్వార్థ ప్రజాసేవకుడు శ్రీ రావుల రాజేంద్ర ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిగా, జనసేన సోషల్ జస్టిస్ విభాగం మాజీ కో-కన్వీనర్‌గా, అలాగే ఆంధ్రప్రదేశ్ ఇన్ఫామ్ (AP INFORM) IMCTI ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన సమాజానికి, ప్రజాక్షేత్రానికి విశేష సేవలందిస్తున్నారు.
జనసేన పార్టీ సిద్ధాంతాలను విశ్వసిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడటంతో పాటు, AP INFORM సంస్థ ద్వారా సామాజిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం విశేష కృషి చేస్తున్నారని ఆయన సహచరులు, ఆత్మీయ మిత్రులు కొనియాడారు. ఉద్యమ నేత మంద కృష్ణ మాదిగతో కలిసి దశాబ్దాలుగా సామాజిక న్యాయం కోసం దృఢ సంకల్పంతో పోరాడుతున్న రాజేంద్ర ప్రసాద్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజాసేవలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
