జన గళం కోడూరు/అవనిగడ్డ బ్యూరో: కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం హంసలదీవి గ్రామంలో కొలువుదీరిన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవస్థానానికి భారీ విరాళం అందింది. కోడూరుకు చెందిన తుమ్మల దేవేంద్ర వరప్రసాద్ (కరణం గారు) – నరసమ్మ దంపతులు స్వామివారి ఆలయ అభివృద్ధి నిమిత్తం రూ. 1,00,116 (లక్షా నూట పదహారు రూపాయలు) నగదు విరాళాన్ని అందజేశారు.
కోడూరులోని దేవేంద్ర వరప్రసాద్ నివాసంలో ఆలయ ప్రతినిధి బాలకృష్ణకు ఈ విరాళం మొత్తాన్ని దంపతులు స్వయంగా అందజేశారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, నిత్య పూజాదికాల నిర్వహణ కోసమే తాము ఈ విరాళాన్ని సమర్పించినట్లు దేవేంద్ర వరప్రసాద్ తెలిపారు. వేణుగోపాలస్వామిపై ఉన్న భక్తిప్రపత్తులతో ఆలయ విస్తరణకు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన దాతల కుటుంబానికి ఆలయ ప్రతినిధి బాలకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి, స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆశీర్వదించారు.
