జన గళం విజయవాడ బ్యూరో: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం విజయవాడ నగర పోలీస్, ఎన్టీఆర్ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా 40 ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడంతో పాటు, భక్తులు సులభంగా చేరుకునేందుకు డిజిటల్ పార్కింగ్ నావిగేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ఉచిత బ్యాటరీ వాహనాలను నడపనున్నారు. నగరంలోకి వచ్చే భారీ వాహనాలకు పక్కా ప్రత్యామ్నాయ దారిమళ్లింపులు (డైవర్షన్స్) అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనరేట్ అధికారులు పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. భక్తులు ట్రాఫిక్ పోలీసుల మార్గదర్శకాలను పాటించి, ప్రశాంత దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Slug: vijayawada-dasara-2026-traffic-advisory-40-parking-places-kanaka-durga-temple
