జన గళం నిడదవోలు బ్యూరో: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల సమరానికి జనసేన పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా సీనియర్ నేత కటకం రామకృష్ణ నియమితులయ్యారు. పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారికంగా సమన్వయ కమిటీ జాబితాను విడుదల చేశారు. క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ సమన్వయ కమిటీకి అందించడంతో పాటు, రాబోయే స్థానిక పోరులో పార్టీ బలోపేతానికి ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. కటకం రామకృష్ణ నియామకం పట్ల జనసేన నాయకుడు సుగుణ బాబు ఇల్లూరితో పాటు నియోజకవర్గ శ్రేణులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
నిడదవోలు సమన్వయకర్తగా కటకం రామకృష్ణ: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!
Slug: katakam-ramakrishna-appointed-janasena-nidadavole-assembly-coordination-committee-member
