జన గళం రాజంపేట/నందలూరు బ్యూరో: అన్నమయ్య జిల్లా నందలూరు మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు తిప్పాయపల్లి ప్రశాంత్ జన్మదిన వేడుకలు శనివారం రాజంపేట పట్టణంలోని యల్లటూరు భవన్లో అత్యంత వైభవంగా జరిగాయి. జనసేన నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు యల్లటూరు శివరామరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలను పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తల సమక్షంలో ప్రశాంత్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. సహచర జనసైనికులు, మిత్రులు, అభిమానులు ప్రశాంత్కు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సత్కరిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.
యల్లటూరు భవన్లో జోరుగా ప్రశాంత్ బర్త్డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!
Slug: thippayapalli-prashanth-birthday-celebrations-janasena-rajampeta-yellaturu-bhavan
