జనగళం 24 ఆంధ్ర డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో, ఎన్టీఆర్ జిల్లా ప్రగతి సాధనలో మంత్రి సత్యకుమార్ చూపుతున్న చొరవను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.
మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లూ ప్రజాసేవలో కొనసాగాలని ఎంపీ కేశినేని చిన్ని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా శాఖాపరంగా చేపడుతున్న సంస్కరణలు విజయవంతం కావాలని కోరుతూ ఆయనకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు.
