జన గళం ఎన్నికల డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థిని శ్రీమతి పినీశెట్టి నాగ ఛాయా దేవి గారి నామినేషన్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (శనివారం, 17/10/2026) ఉదయం 9:30 గంటలకు పినీశెట్టి నాగ ఛాయా దేవి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా భారీ జనసమీకరణతో నామినేషన్ ర్యాలీ నిర్వహించనున్నారు.
ఈ భారీ ర్యాలీ వారి స్వగృహం నుంచి ప్రారంభమై, జడ్పీ సెంటర్ మీదుగా 6వ వార్డు సచివాలయం వరకు సాగనుంది. అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా స్థానిక ఎన్నికల్లో జనసేన జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు, వీర మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయాలని పినీశెట్టి వేణుగోపాల్ గారు విజ్ఞప్తి చేశారు.
