బ్రేకింగ్ న్యూస్
సాలూరు మున్సిపల్ పీఠం రగడ: జనసేనకు కేటాయింపుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర అసంతృప్తి.. రంగంలోకి దిగి బుజ్జగించిన మంత్రి అచ్చెన్నాయుడు!స్థానిక ఎన్నికల్లో పెనమలూరులో కూటమి జెండా రెపరెపలాడాలి: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, బోడే ప్రసాద్ దిశానిర్దేశం!స్థానిక సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ సిద్ధం: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, కాగిత కృష్ణప్రసాద్ సమీక్ష!కృష్ణలంక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐకి అప్పగింత.. రూ. 25 లక్షల పరిహారానికి ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!​నూజివీడులో ఆటోల ఆగడాలు: వన్‌వేలో ఎదురుదిశగా దూకుడు.. దసరా వేళ నిబంధనలు గాలికి!కలిదిండి జనసేనలో తీవ్ర అయోమయం: ఒకే సమయంలో రెండు కీలక సమావేశాలు.. కూటమి సమన్వయ లోపమా? జనసేనను విస్మరించే వ్యూహమా?టీడీపీ సీనియర్ నేత వలవల సత్యనారాయణకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఘన నివాళి!తోటమూలలో స్థానిక సమరానికి జనసేన సైన్యం రెడీ.. విస్తృత సమావేశంలో సమన్వయకర్తల కీలక దిశానిర్దేశం!ఎంపీ వల్లభనేని బాలశౌరితో పెనమలూరు జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై విస్తృత చర్చ!తూర్పు గోదావరి జడ్పీ పీఠంపై జనసేన కసరత్తు: చైర్‌పర్సన్ రేసులో గంటా స్వరూపాదేవి.. అధినేత పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తుల వెల్లువ!సాలూరు మున్సిపల్ పీఠం రగడ: జనసేనకు కేటాయింపుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర అసంతృప్తి.. రంగంలోకి దిగి బుజ్జగించిన మంత్రి అచ్చెన్నాయుడు!స్థానిక ఎన్నికల్లో పెనమలూరులో కూటమి జెండా రెపరెపలాడాలి: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, బోడే ప్రసాద్ దిశానిర్దేశం!స్థానిక సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ సిద్ధం: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, కాగిత కృష్ణప్రసాద్ సమీక్ష!కృష్ణలంక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐకి అప్పగింత.. రూ. 25 లక్షల పరిహారానికి ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!​నూజివీడులో ఆటోల ఆగడాలు: వన్‌వేలో ఎదురుదిశగా దూకుడు.. దసరా వేళ నిబంధనలు గాలికి!కలిదిండి జనసేనలో తీవ్ర అయోమయం: ఒకే సమయంలో రెండు కీలక సమావేశాలు.. కూటమి సమన్వయ లోపమా? జనసేనను విస్మరించే వ్యూహమా?టీడీపీ సీనియర్ నేత వలవల సత్యనారాయణకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఘన నివాళి!తోటమూలలో స్థానిక సమరానికి జనసేన సైన్యం రెడీ.. విస్తృత సమావేశంలో సమన్వయకర్తల కీలక దిశానిర్దేశం!ఎంపీ వల్లభనేని బాలశౌరితో పెనమలూరు జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై విస్తృత చర్చ!తూర్పు గోదావరి జడ్పీ పీఠంపై జనసేన కసరత్తు: చైర్‌పర్సన్ రేసులో గంటా స్వరూపాదేవి.. అధినేత పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తుల వెల్లువ!
అమరావతి

స్థానిక సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ సిద్ధం: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, కాగిత కృష్ణప్రసాద్ సమీక్ష!

స్థానిక సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ సిద్ధం: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, కాగిత కృష్ణప్రసాద్ సమీక్ష!

మచిలీపట్నం పార్లమెంట్, పెడన నియోజకవర్గ సమన్వయకర్తలతో కీలక సమావేశం

​జన గళం బ్యూరో, మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయకేతనం ఎగురవేయడమే ధ్యేయంగా నాయకత్వం వ్యూహరచనను వేగవంతం చేసింది. మచిలీపట్నంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల పార్లమెంట్ సమన్వయ, ప్రచార కమిటీ సభ్యులు మరియు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణప్రసాద్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.

Related News Desk స్థానిక ఎన్నికల్లో పెనమలూరులో కూటమి జెండా రెపరెపలాడాలి: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, బోడే ప్రసాద్ దిశానిర్దేశం!

​ఈ సమీక్షలో ప్రధానంగా పెడన మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక, ప్రచార ప్రణాళికలు, క్షేత్రస్థాయి సమీకరణాలపై నాయకులు చర్చించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు విభేదాలకు తావులేకుండా కలిసికట్టుగా పనిచేసి ప్రజల్లోకి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకెళ్లాలని ఎంపీ బాలశౌరి సూచించారు. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల గెలుపు అవకాశాలే గీటురాయిగా నిర్ణయాలు ఉంటాయని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు.

​ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంట్ కో-ఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తలు శ్రీ మండలి వెంకట రామ్, శ్రీ బండి రామకృష్ణ, శ్రీ చిలకలపూడి పాపారావు, శ్రీమతి డాక్టర్ మాధవి మరియు పెడన అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు శ్రీ అంకెం లక్ష్మీ శ్రీనివాసరావు, శ్రీ లింగం నాగేశ్వర రావు, శ్రీ విక్కుర్తి శ్రీనివాస్ బాబు తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను, క్షేత్రస్థాయి సమాచారాన్ని నాయకత్వానికి వివరించారు.