బ్రేకింగ్ న్యూస్
సాలూరు మున్సిపల్ పీఠం రగడ: జనసేనకు కేటాయింపుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర అసంతృప్తి.. రంగంలోకి దిగి బుజ్జగించిన మంత్రి అచ్చెన్నాయుడు!స్థానిక ఎన్నికల్లో పెనమలూరులో కూటమి జెండా రెపరెపలాడాలి: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, బోడే ప్రసాద్ దిశానిర్దేశం!స్థానిక సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ సిద్ధం: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, కాగిత కృష్ణప్రసాద్ సమీక్ష!కృష్ణలంక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐకి అప్పగింత.. రూ. 25 లక్షల పరిహారానికి ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!​నూజివీడులో ఆటోల ఆగడాలు: వన్‌వేలో ఎదురుదిశగా దూకుడు.. దసరా వేళ నిబంధనలు గాలికి!కలిదిండి జనసేనలో తీవ్ర అయోమయం: ఒకే సమయంలో రెండు కీలక సమావేశాలు.. కూటమి సమన్వయ లోపమా? జనసేనను విస్మరించే వ్యూహమా?టీడీపీ సీనియర్ నేత వలవల సత్యనారాయణకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఘన నివాళి!తోటమూలలో స్థానిక సమరానికి జనసేన సైన్యం రెడీ.. విస్తృత సమావేశంలో సమన్వయకర్తల కీలక దిశానిర్దేశం!ఎంపీ వల్లభనేని బాలశౌరితో పెనమలూరు జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై విస్తృత చర్చ!తూర్పు గోదావరి జడ్పీ పీఠంపై జనసేన కసరత్తు: చైర్‌పర్సన్ రేసులో గంటా స్వరూపాదేవి.. అధినేత పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తుల వెల్లువ!సాలూరు మున్సిపల్ పీఠం రగడ: జనసేనకు కేటాయింపుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర అసంతృప్తి.. రంగంలోకి దిగి బుజ్జగించిన మంత్రి అచ్చెన్నాయుడు!స్థానిక ఎన్నికల్లో పెనమలూరులో కూటమి జెండా రెపరెపలాడాలి: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, బోడే ప్రసాద్ దిశానిర్దేశం!స్థానిక సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ సిద్ధం: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, కాగిత కృష్ణప్రసాద్ సమీక్ష!కృష్ణలంక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐకి అప్పగింత.. రూ. 25 లక్షల పరిహారానికి ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!​నూజివీడులో ఆటోల ఆగడాలు: వన్‌వేలో ఎదురుదిశగా దూకుడు.. దసరా వేళ నిబంధనలు గాలికి!కలిదిండి జనసేనలో తీవ్ర అయోమయం: ఒకే సమయంలో రెండు కీలక సమావేశాలు.. కూటమి సమన్వయ లోపమా? జనసేనను విస్మరించే వ్యూహమా?టీడీపీ సీనియర్ నేత వలవల సత్యనారాయణకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఘన నివాళి!తోటమూలలో స్థానిక సమరానికి జనసేన సైన్యం రెడీ.. విస్తృత సమావేశంలో సమన్వయకర్తల కీలక దిశానిర్దేశం!ఎంపీ వల్లభనేని బాలశౌరితో పెనమలూరు జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై విస్తృత చర్చ!తూర్పు గోదావరి జడ్పీ పీఠంపై జనసేన కసరత్తు: చైర్‌పర్సన్ రేసులో గంటా స్వరూపాదేవి.. అధినేత పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తుల వెల్లువ!
అమరావతి

తోటమూలలో స్థానిక సమరానికి జనసేన సైన్యం రెడీ.. విస్తృత సమావేశంలో సమన్వయకర్తల కీలక దిశానిర్దేశం!

తోటమూలలో స్థానిక సమరానికి జనసేన సైన్యం రెడీ.. విస్తృత సమావేశంలో సమన్వయకర్తల కీలక దిశానిర్దేశం!

అత్యధిక స్థానాల్లో గెలిచి పవన్ కళ్యాణ్‌కు బహుమతిగా ఇవ్వాలి: అంకెం, లింగం, విక్కుర్తి పిలుపు

​జన గళం బ్యూరో, పెడన: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేళ జనసేన పార్టీ శ్రేణుల్లో ఎన్నికల జోష్ పెరిగింది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకాలకు అనుగుణంగా నియోజకవర్గంలో పార్టీని విజయపథంలో నడిపించేందుకు పెడన పట్టణ సమీపంలోని తోటమూల గ్రామ జనసేన పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

Related News Desk స్థానిక ఎన్నికల్లో పెనమలూరులో కూటమి జెండా రెపరెపలాడాలి: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, బోడే ప్రసాద్ దిశానిర్దేశం!

​ఈ సమావేశంలో పెడన నియోజకవర్గ జనసేన సమన్వయకర్తలు శ్రీ అంకెం లక్ష్మీ శ్రీనివాస్, శ్రీ లింగం నాగేశ్వరరావు, శ్రీ విక్కుర్తి శ్రీనివాస్ బాబు సంయుక్తంగా పాల్గొని పార్టీ శ్రేణులను ఎన్నికల పోరుకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. గ్రామాలు, వార్డుల వారీగా క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజా సమస్యలపై పూర్తి అవగాహనతో ముందుకు సాగాలని తెలిపారు. నియోజకవర్గంలోని మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఘనమైన కానుకను అందించాలని పిలుపునిచ్చారు.

​కార్యకర్తల అభిప్రాయాలకు పూర్తి విలువనిస్తూ అర్హులైన నాయకులకు తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. తోటమూల వేదికగా జరిగిన ఈ సమర శంఖారావ సభకు పెడన నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల నాయకులు, వీరమహిళలు, క్రియాశీల జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై తమ బలప్రదర్శనను చాటారు.