జన గళం నియోజకవర్గ డెస్క్: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల సమరానికి జనసేన పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయకర్త శ్రీ వల్లభనేని బాలశౌరి గారిని పెనమలూరు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తలు శ్రీ నెరుసు కృష్ణ ఆంజనేయులు, శ్రీ బొల్లం వీరన్ కుమార్, శ్రీ వడ్డీ జీవలతో పాటు సమన్వయ దళ్ సభ్యులు, జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ, ప్రస్తుత క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులు, బలమైన అభ్యర్థుల ఎంపికపై ఎంపీతో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, అనుసరించాల్సిన వ్యూహాత్మక విధివిధానాలపై వల్లభనేని బాలశౌరి నాయకులకు పలు కీలక సూచనలు చేశారు. ఎన్డీయే కూటమి శ్రేణులను కలుపుకొని పోతూ క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
